Vivek Agnihotri : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన మూవీ ది కశ్మీర్ ఫైల్స్ . 1990 నాటి సంఘటన ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri).
జమ్మూ కాశ్మీర్ లో కశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణాలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాగించిన మారుణకాండ, కాల్పుల మోతను కళ్లకు కట్టినట్లు చూపించే చూపించాడు.
ఈ తరుణంలో విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ చిత్రాన్ని భుజాన మోస్తోంది. దీనిపై ఓ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే పలు రాష్ట్రాలలో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి వినోద పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాయి. కాగా రూ. 100 కోట్లను దాటేసింది ఈ సినిమా. దర్శకుడి ప్రాణానికి ముప్పు వాటిల్లనుందని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి.
దీంతో వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ కింద సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన ప్రతి ఒక్కరిని చూడాలని పిలుపునిచ్చారు.
వివాదాస్పదంగా మారింది ఈ మూవీ. సీఆర్పీఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా బీహార్ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈనెల 25న ది కశ్మీర్ ఫైల్స్ ను ఉచితంగా చూపించనున్నారు.
డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ కోరారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ , దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషిలు నటించారు. ప్రస్తుతం హిట్ టాక్ తెచ్చుకుని దూసుకు పోతోంది దేశమంతటా ది కశ్మీర్ ఫైల్స్.
Also Read : ఆర్ఆర్ఆర్ కు టిక్కెట్ల ధర రూ 75పెంపుకు ఓకే