Maitri Amazon Prime : అమెజాన్ ప్రైమ్ లో ‘మ‌హిళ‌లు విజేత‌లు’

అమెజాన్ ప్రైమ్ లో మైత్రి క‌లెక్టివ్

Maitri Amazon Prime : అమెజాన్ ప్రైమ్ కొత్తగా ఆలోచిస్తోంది. అద్భుత‌మైన కంటెంట్ కు ప్ర‌యారిటీ ఇస్తూ దూసుకు పోతోంది. దేశంలోని వివిధ భాష‌ల్లో కూడా వీటిని త‌యారు చేసే ప‌నిలో ప‌డింది.

ఇందులో భాగంగా వివిధ రంగాల‌లో పేరొందిన వారిని ఇప్ప‌టికే ప‌రిచ‌యం చేసింది.

తాజాగా వినోద రంగం ( ప్ర‌చురుణ‌, ప్ర‌సార‌, సోష‌ల్ మీడియా )లో పేరొందిన వారు, విజేత‌లుగా నిలిచిన వారిని మైత్రీ పేరుతో ప‌రిచ‌యం చేస్తోంది.

ఈ మేర‌కు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి ఫిమేల్ ఫ‌స్ట్ క‌లెక్టివ్ ల‌ను ప్రారంభించింది.

వినోదంలో మ‌హిళలు స‌వాళ్లు, విజ‌యాల గురించి ఇందులో పొందు ప‌రిచారు.

ప్ర‌త్యేకించి ఇండియాలో మీడియా , వినోద ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల పాత్ర కాల‌క్ర‌మేణా గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందింది. ప‌రిశ్ర‌మ‌లో ఎంట‌ర్ అయ్యే ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎలాంటి స‌వాళ్ల‌ను వారు అధిగ‌మించార‌నే దానిపై మైత్రీ ఫోక‌స్(Maitri Amazon Prime) చేస్తుంది.

క్రియేటివిటీ, ప్ర‌తిభ‌, నాయ‌క‌త్వానికి మార్గ‌ద‌ర్శ‌కులుగా మార‌డం వ‌ర‌కు మ‌హిళ‌లు అనేక విధాలుగా త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

వారంతా త‌మ స్వంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇవాళ పురుషుల‌తో పాటు మ‌హిళ‌లు కూడా పోటీగా నిలిచారు.

ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకుంటూనే భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండేలా త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఏది ఏమైనా ఇంత టెక్నాల‌జీ విస్త‌రించినా ఇంకా ఆయా రంగాల‌లో మ‌హిళ‌ల ప‌రిస్థితి మార‌లేదు.

లింగ వైవిధ్యం, వివ‌క్ష ఇంకా కొన‌సాగుతోంది. ఇందుకు అమెజాన్ ప్రైమ్ (Maitri Amazon Prime)ముందుకు వ‌చ్చింది.

ఫిమేల్ ఫ‌స్ట్ క‌లెక్టివ్ ను ప్రారంభించేందుకు ముంబై అకాడ‌మీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ తో క‌లిసి ప‌ని చేస్తోంది.

మీడియా, వినోద ప‌రిశ్ర‌మ‌ల్లోని మ‌హిళ‌ల సంభాష‌ణ‌లు, స‌హ‌కారాన్ని పెంపొందించేలా ఒక చోటుకు చేర్చింది.

మ‌హిళ‌లు త‌మ ఆకాంక్ష‌లు పంచుకోవ‌డాన‌కి, ఒక‌రి అనుభ‌వాలు మ‌రొక‌రు నేర్చు కోవ‌డానికి ఇది ఉప‌యోగ ప‌డుతుంది.

సానుకూల మార్పును ఎలా తీసుకు రావాల‌నే దానిపై వారి దృక్ఫ‌థం దోహ‌ద ప‌డుతుంది.

వీరిలో 16 మంది పేరొందిన మ‌హిళ‌లు ఉన్నారు. వీరిలో జంగ్లీ పిక్చ‌ర్స్ టైమ్స్ స్టూడియో ఒరిజిన‌ల్స్ సిఇఓ అమృత పాండే.

థిల్లాన్ స్క్రీన్ రైట‌ర్ అండ్ హెయిర్ స్టైలిష్ అయేషా దేవిత్రే. ర‌చయిత్రి భ‌వానీ అయ్య‌ర్. ఫిల్మ్ మేక‌ర్ గాయ‌త్రి.

జీవా, జుహీ చ‌తుర్వేది. కున్ జీ, నుపుర్ ఆస్థానా, రిచా చ‌ద్దా, రింటూ థామ‌స్ , శ్వేతా త్రిపాఠి శ‌ర్మ‌, సుముఖి సురేష్ ,

తాహిరా క‌శ్య‌ప్ ఖురానా, అమెజాన్ ప్రైమ్ వీడియో చీఫ్ అప‌ర్ణా పురోహొత్ , మామి ఆర్టిస్టిక్ డైరెక్ట‌ర్ స్మృతి కిర‌ణ్ ఉన్నారు.

Also Read : ఆప‌ద‌లో ఆదుకునే ఇంపాక్ట్ గురూ

Leave A Reply

Your Email Id will not be published!