Jay Shah : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు లో ఇప్పటికే కార్యదర్శిగా చక్రం తిప్పుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జే షా మరోసారి తన సత్తా చాటారు.
ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా(Jay Shah) ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలన్ని పొడిస్తూ ఏసీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. చీఫ్ గా ఆయనే ఉండాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా గతంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు – బీసీబీ అధ్యక్షుడిగా ఉన్న నజ్ముల్ హసన్ నుంచి గత ఏడాది జనవరి లో అమిత్ షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ పగ్గాలు చేపట్టారు.
కాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా తిరిగి మరోసారి నియమితులైన జే షా ఇప్పటి వరకు పదవులు స్వీకరించిన వారి కంటే వయసులో చిన్న వాడు కావడం విశేషం.
ఈ కీలక సమావేశంలో ఆసియా కప్ 2022 ఆగ్టు 27 నుంచి సెప్టెంబర్ వరకు శ్రీలంకలో జరుగుతుందని ఏసీసీ ఇవాళ ప్రకటించింది. ఈ ఏడాది టీ20 ఫార్మాట్ లోనే చేపట్టాలని నిర్ణయించింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఆఫ్గనిస్తాన్ తో పాటు ఇతర ఆసియా క్రికెట్ జట్ల బోర్డు ప్రతినిధులతో జే షా(Jay Shah) హాజరయ్యారు. ఏసీసీ వార్షిక సర్వ సభ్య సమావేశం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
జే షా వచ్చే 2024 వరకు ఏసీసీ చీఫ్ గా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా జే షా మాట్లాడారు. ఈ ప్రాంతంలో క్రికెట్ ను మరింత బలోపేతం చేస్తామన్నారు. మహిళా క్రికెట్ కు ప్రయారిటీ ఇస్తామన్నారు.
Also Read : కిర్మానితో అజ్బూ భాయ్ ముచ్చట