Sonia Gandhi : దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల అనంతరం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
గాంధీ ఫ్యామిలీ వ్యతిరేక వర్గంగా పేరొందిన జీ-23 నేతలు ఈ మధ్య ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీపై (Sonia Gandhi)తీవ్ర వత్తిడి తీసుకు వచ్చారు.
నాయకత్వం నుంచి వెంటనే దిగి పోవాలని, కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ బాహాటంగానే డిమాండ్ చేశారు.
దీంతో సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా, ప్రియాంక, రాహుల్ తమ పదవుల నుంచి తప్పుకునేందుకు రెడీ అయ్యారు.
వ్యతిరేక వర్గాని కంటే గాంధీ ఫ్యామిలీ అనుకూల వర్గం ఎక్కువగా ఉండడం, ఒప్పుకోక పోవడంతో గొడవ సద్దు మణిగింది.
ఆ తర్వాత రెండు సార్లు ఆజాద్ నివాసంలో అసంతృప్త నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు రంగంలోకి స్వయంగా సోనియా గాంధీ దిగారు.
అసమ్మతి స్వరం వినిస్తూ వచ్చిన ఆజాద్ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు. మేడంతో ఆయన భేటీ అయ్యారు. తమ వర్గంలోని నేతలు తన ముందుంచిన డిమాండ్లను సోనియా ముందు ఉంచారు.
సమావేశం అనంతరం ఆజాద్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి సోనియా సారథ్యంలోనే పార్టీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ తరుణంలో సోనియా గాంధీ (Sonia Gandhi)కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రక్షాళన ప్రారంభించారు.
పలు అంశాలపై వీరి మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో పలు మార్పులకు మేడం శ్రీకారం చుట్టింది. ఆజాద్ సూచనలకు మేడం పచ్చ జెండా ఊపారు. వచ్చే ఏడాది కన్నడ నాట ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో ఆయనకే పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఆ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉందని సమాచారం.
ఆయనను అక్కడి నుంచే రాజ్యసభకు నామినేట్ చేయాలని అనుకుంటోంది.
మరో అసమ్మతి నేత ఆనంద్ శర్మ ను కూడా రాజ్యసభకు పంపించనున్నారు మేడం. మనీష్ తివారీకి ఏఐసీసీలో కీలక పదవి అప్పగించనుంది.
భూపీందర్ సింగ్ హూడాకు హర్యానా పీసీసీ చీఫ్ గా అప్పగించనుంది. ఇక కపిల్ సిబల్ కు ఏ పదవి ఇవ్వాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : ముదిరిన వివాదం కాంగ్రెస్ కు అల్టిమేటం