Delhi Capitals 2022 : జోరు సాగించేనా ఢిల్లీ గెలిచేనా

26 నుంచి ఐపీఎల్ -15 సీజ‌న్ స్టార్

Delhi Capitals 2022 : ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ -2022 ఈనెల 26న ప్రారంభం కానుంది. ముంబై వేదిక‌గా జ‌రిగే ఈ టోర్నీపై ఇప్ప‌టికే ప‌లు అంచ‌నాలు ఉన్నాయి. వ‌రుస‌గా క‌ప్ గెలుస్తూ వ‌స్తున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రోసారి క‌ప్ పై క‌న్నేసింది.

సీఎస్కే యాజ‌మాన్యం సూప‌ర్ స్టార్ గా పేరొందిన మ‌హేంద్ర సింగ్ ధోనీని త‌మ నాయ‌కుడిగా ప్ర‌క‌టించింది. ఇక దుబాయి వేదిక‌గా జ‌రిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals 2022) ఈసారి జోరు సాగిస్తుందా అన్న‌ది వేచి చూడాలి.

ఇక ఐపీఎల్ సంబురానికి కొద్ది రోజులే ఉండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. గ‌త నెల 12, 13 తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మేనేజ్ మెంట్ స్టార్ ప్లేయ‌ర్ల‌ను చేజిక్కించుకుంది.

ఒక్కో మేనేజ్ మెంట్ ఒక్కో రీతిన వ్య‌వ‌హ‌రించింది. సీఎస్కేపై పూర్తిగా ధోనీ ప్ర‌భావం ఉంది. ఈసారి డీసీ అనుస‌రించిన వ్యూహం స‌రిగా లేద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మైంది. విదేశీ స్టార్ల‌ను ఎంచుకోవ‌డంలో శ్ర‌ద్ద చూప‌క పోవ‌డం విస్తు పోయేలా చేసింది.

ఈసారి మెగా వేలంలో ఏడుగురిని మాత్ర‌మే తీసుకుంది. స్టార్ బౌల‌ర్ ఉన్న‌ట్టుండి జ‌ట్టుకు దూరం కావ‌డం కొంత ఇబ్బందిక‌ర‌మే ఆ జ‌ట్టుకు. ఆసిస్ ప్లేయ‌ర్ వార్న‌ర్ , మార్ష్ కూడా ఆడ‌డం లేదు. ఆ జ‌ట్టుకు పెద్ద దెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

మొత్తంగా జ‌ట్టు ప‌రంగా చూస్తే చాలా ప‌టిష్టంగా ఉంది. స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన స‌ర్ప‌రాజ్ ఖాన్ ఉన్నాడు. మ‌న్ దీప్ సింగ్ య‌శ్ ధుల్ ఆడ‌నున్నారు. ప్ర‌వీణ్ దూబే, లలిత్ యాదవ్ స్పిన్న‌ర్ల‌తో ఆడ‌నుంది ఆ జ‌ట్టు.

రిష‌బ్ పంత్ ఆ జ‌ట్టుకు బ‌లం. శిఖ‌ర్ ధావ‌న్ తో పాటు అశ్విన్ ను పోగొట్టుకుంది. ఈసారైనా జోరు సాగిస్తుంద‌ని న‌మ్ముతున్నారు క్రీడాభిమానులు.

Also Read : ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ గా జే షా

Leave A Reply

Your Email Id will not be published!