Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి బీజేపీని, మోదీని టార్గెట్ చేశారు. ప్రతి దానిని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు.
తాజాగా ఆయన ఈనెల 11న దేశ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై స్పందించారు. ఈ చిత్రాన్ని వివేక్ అగ్ని హోత్రి తీశారు.
1980 నాటి చివర్లో 1990 లో జమ్మూ కశ్మీర్ లో కశ్మీర్ పండిట్లపై చోటు చేసుకున్న దారుణాలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దారుణ మారణకాండ కారణంగా లక్షలాది మంది వలస వెళ్లారనే దానిని ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు.
ప్రస్తుతం ఇది స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మూవీ కంటే ఎక్కువ వసూళ్లతో దూసుకు పోతోంది. సినీ విమర్శకులను విస్తు పోయేలా చేసింది.
దీనిని భారతీయ జనతా పార్టీ , దాని అనుబంధ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు భుజానికి ఎత్తుకున్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి దీనిని ప్రమోట్ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్ చేస్తే ఆయనకు తోడుగా ప్రస్తుతం సంజయ్ రౌత్(Sanjay Raut) సీరియస్ అయ్యారు. మనుషుల భావోద్వేగాలతో వచ్చే సినిమాలు తెర మీద చూసేందుకు బావుంటాయని కానీ రియల్ లైఫ్ వచ్చేసరికి భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు ఎంపీ. సి
నిమాను సినిమాగా చూడకుండా దానిని రాజకీయం చేశారని, ఈ ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. ప్రచారం ఎలా చేసుకోవాలో మోదీని చూసి నేర్చుకోవాలన్నారు. రౌత్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : మహేష్ తో చిత్రం మల్టీస్టారర్ కాదు – రాజమౌళి