Babul Supriyo : పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ గాయకుడు, టీఎంసీ నేత బాబుల్ సుప్రియో (Babul Supriyo)సంచలన కామెంట్స్ చేశారు. గతంలో ఆయన భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉన్నారు.
కేంద్ర మంత్రిగా పని చేశారు. ఎన్నికల్లో పూర్ పర్ ఫార్మెన్స్ కారణంగా పక్కన పెట్టారు. దీంతో మనస్థాపం చెందిన సుప్రియో తాను సామాజిక సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతానని , పాలిటిక్స్ కు దూరంగా ఉంటానని ప్రకటించారు.
అప్పట్లో అది సంచలనం కలిగించింది. ఇటీవల రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అనూహ్యంగా బాబుల్ సుప్రియోకు(Babul Supriyo) దీదీ నేతృత్వంలోని టీఎంసీ స్వాగతం పలికింది.
దీంతో మనసు మార్చుకున్న సుప్రియో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది.
బాబుల్ సుప్రియో స్థానంలో ప్రముఖ నటుడు కాంగ్రెస్, బీజేపీ నుంచి జంప్ అయిన శత్రుఘ్న సిన్హాకు ఛాన్స్ ఇచ్చింది మమతా బెనర్జీ.
ఇక తన పదవిని త్యాగం చేసి పార్టీ కోసం పని చేసిన బాబుల్ సుప్రియోకు ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలో బరిలోకి దింపింది సీఎం.
ఈ సందర్బంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు బాబుల్ సుప్రియో. కుల, మతాల పేరుతో విభేదాలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అందుకే నచ్చకే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. బెంగాల్ వారసత్వం, సంస్కృతి విధానాన్ని కాపాడుకునేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. బీజేపీ నాయకులు తనను మోసం చేశారంటూ ఆరోపించారు.
Also Read : కావాలని బద్నాం చేస్తున్నారు