Russia Ukraine War : దాడుల ప‌రంప‌ర ఆగ‌ని మార‌ణ‌కాండ

పిట్ట‌ల్లా రాలి పోతున్న పౌరులు..చిన్నారులు

Russia Ukraine War : ర‌ష్యా రాక్ష‌సానందం కంటిన్యూగా కొన‌సాగుతూనే ఉంది. ఓ వైపు దాడుల‌కు పాల్ప‌డుతూ ఇంకో వైపు చ‌ర్చ‌ల‌కు సిద్దమంటూ పుతిన్ ప్ర‌క‌టించ‌డాన్ని యావ‌త్ ప్ర‌పంచం త‌ప్పు ప‌డుతోంది.

ప్ర‌పంచ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఐక్య రాజ్య స‌మితితో పాటు పోప్ ఫ్రాన్సిస్ , యూరోపియన్ కంట్రీస్, అమెరికా నెత్తి నోరు బాదుకున్నా ప‌ట్టించు కోలేదు.

ఆర్థిక ఆంక్ష‌లు విధించినా స‌సేమిరా అంటూ ర‌ష్యా దాడుల‌కు తెగ బ‌డుతోంది.

ఇప్ప‌టికే ప‌చ్చ‌గా ఉన్న ఉక్రెయిన్ (Russia Ukraine War)వ‌ల్ల‌కాడును త‌ల‌పింప చేస్తోంది. నిన్న‌టి దాకా తాము పౌరుల‌ను టార్గెట్ చేయ‌డం లేద‌ని బుకాయిస్తూ వ‌చ్చిన

ర‌ష్యా ఇప్పుడు ఏకంగా వారినే ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు తెగ బ‌డుతోంది.

బాంబుల మోత‌ల‌తో దద్దరిల్లుతోంది. ఇంకో వైపు మిస్సైల్స్ ను ప్ర‌యోగిస్తోంది. రోజుకు ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నార‌నే దానిపై ఈరోజు వ‌ర‌కు ఎలాంటి అంచనాలు లేవు.

వేలాది మంది ఇప్ప‌టికే క‌నుమ‌రుగై పోయారు. నిన్న ఊహించ‌ని రీతిలో పాఠ‌శాల భ‌వ‌నంలో త‌ల‌దాచుకున్న పిల్ల‌ల‌పై అమానుషంగా దాడుల‌కు దిగింది.

స‌భ్య స‌మాజం త‌ల వంచుకునేలా ప్ర‌వ‌ర్తించిన పుతిన్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి.

ఏక‌ప‌క్షంగా దాడుల‌కు దిగుతూ యుద్దం కాద‌ని సైనిక చ‌ర్య అంటూ స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న ర‌ష్యా చీఫ్ ప్ర‌పంచం ముందు దోషిగా నిల‌బ‌డ‌క త‌ప్ప‌దు.

ఈ దారుణ మార‌ణ‌కాండ ఇలాగే కొన‌సాగుతూ పోతే చివ‌ర‌కు మూడో ప్ర‌పంచ యుద్ధం వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేదంటున్నారు యుద్ద‌రంగ నిపుణులు.

దేని కోసం యుద్దం. ఎందు కోసం ఈ దాడులు. ఈ ప్ర‌పంచానికి చెప్పాల్సింది ర‌ష్యా(Russia Ukraine War). దానిని స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్న చైనా, ఇండియా కూడా బాధ్య‌త వ‌హించాల్సిందే.

త‌న‌ను ఎదిరించాడ‌ని, త‌న‌కు లొంగి పోలేద‌న్న ఒకే ఒక్క కార‌ణంగా జెలెన్ స్కీని భౌతికంగా ఖ‌తం చేయాల‌న్న బ‌లీయ‌మైన కాంక్ష ఇంత మందిని పొట్ట‌న పెట్టుకునేలా చేసింది.

తాత్కాలికంగా పుతిన్ ఇగో (అహం) సంతృప్తి చెంద‌వ‌చ్చు గాక‌. కానీ దాడులు మిగిల్చిన విషాదం మాత్రం ప్ర‌పంచ చ‌రిత్ర‌లో మాత్రం నిలిచి పోతుంది.

రాజ్యాధికారం ఎక్కువ కాలం ఉండ‌ద‌ని గుర్తించిన రోజున పుతిన్ కు కూడా ఇలాంటి గ‌తే ప‌డుతుంద‌న్న‌ది వాస్త‌వం. ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్యం. కాలం ముందు ఎవ‌రూ విజేత‌లు కాద‌న్న సత్యం గుర్తించాలి.

యావ‌త్ ప్ర‌పంచం ఒక్క‌టైన రోజున ర‌ష్యా ఒంట‌రి కాక త‌ప్ప‌దు. ఇక‌నైనా పుతిన్ మారాలి. చ‌ర్చ‌ల‌కు స్వాగ‌తం ప‌ల‌కాలి.

Also Read : ఆ అందం వెనుక అంతులేని విషాదం

Leave A Reply

Your Email Id will not be published!