Telangana Congress : స‌మ‌న్వ‌య లోపం కాంగ్రెస్ కు శాపం

విధేయుల ఫోరం అస‌మ్మ‌తి స్వ‌రం

Telangana Congress  : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడి పుట్టిస్తున్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి (Rewanth Reddy) టీపీసీసీ చీఫ్ గా ఎంపికైన నాటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ లో క‌ల‌క‌లం(Telangana Congress )రేగుతూనే ఉంది. సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు.

రేవంత్ రెడ్డి (Rewanth Reddy) వ‌న్ మెన్ షో న‌డిపిస్తున్నాడంటూ మండిప‌డుతున్నారు. ఉన్న‌ట్టుండి అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో త‌మ స్వ‌రాన్ని పెంచుతూ వ‌స్తున్నారు.

తాజాగా విధేయుల ఫోరంతో స‌మావేశం ఏర్పాటు చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. వీహెచ్, జ‌గ్గారెడ్డి, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇంకో వైపు రేవంత్ రెడ్డి (Telangana Congress )ఊరు పోరు పేరుతో ప్ర‌చారం చేప‌ట్టారు.

ఆయ‌న వ‌చ్చాక కొంత క‌ద‌లిక వ‌చ్చింది పార్టీలో. డిజిట‌ల్ స‌భ్య‌త్వాల్లో దేశంలోనే టాప్ లో నిలిచింది తెలంగాణ‌లో.

త్వ‌ర‌లో ముంద‌స్తుకు కేసీఆర్ వెళుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ త‌రుణంలో (Congress Party) లో అంత‌ర్గ‌త విభేదాలు పొడ‌సూప‌డం పార్టీ శ్రేణుల‌ను అయోమ‌యంలోకి నెట్టివేసేలా చేస్తోంది.

ఇదే స‌మ‌యంలో ఏఐసీసీ నుంచి కూడా విధేయుల ఫోరం నేత‌ల‌కు ఫోన్ చేసినా ప‌ట్టించు కోలేదు.

తాము వ్య‌తిరేకులం కామ‌ని తాము సోనియా, రాహుల్ , ప్రియాంక నాయ‌క‌త్వానికి విధేయుల‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అంద‌రిని క‌లుపుకుని పోవాల‌ని సూచించారు ఈ ఫోరంకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

తాను హీరోనో లేదా నువ్వు హీరోవో తేల్చుకుందాం దా అంటూ రేవంత్ రెడ్డికి స‌వాల్ చేశారు. స‌స్పెండ్ చేసి చూడు తెలుస్తుంది తానేమిటో అని చెప్పాడు.

ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా గాంధీ భ‌వ‌న్ లో ప్రెస్ మీట్ పెట్ట‌డం కూడా చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతున్న క్ర‌మంలో సీనియ‌ర్లు ఇలా అస‌మ్మ‌తి స్వ‌రం వినిపించ‌డం పార్టీకి పెద్ద దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌నైనా హైక‌మాండ్ ఎందుకు ఫోక‌స్ పెట్ట‌డం లేదో అర్థం చేసుకోవాలి. పార్టీ భ‌విష్య‌త్తు సీనియ‌ర్ల‌పై కంటే ప్ర‌స్తుతం బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న రేవంత్ రెడ్డిపైనే ఉంది.

Also Read : ఇక మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌దా

Leave A Reply

Your Email Id will not be published!