WI vs ENG 2nd Test : మరోసారి మెరిసాడు వెస్టిండీస్ (West Indies) స్కిప్పర్ క్రెయిగ్ బ్రాత్ వైట్ . తన జట్టుకు సరైన నాయకుడినని నిరూపించాడు. స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో(WI vs ENG 2nd Test )అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తన జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. డ్రా అయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిడ్జిబేన్ మైదానంలో చోటు చేసుకున్న ఈ మ్యాచ్ పూర్తిగా విండీస్ కెప్టెన్ వైపు ఫోకస్ పెట్టేలా చేసింది.
ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ , బెన్ స్టోక్స్ (WI vs ENG 2nd Test )అద్భుతంగా ఆడారు. విండీస్ బౌలర్ల భరతం పట్టారు. 507 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది ఇంగ్లండ్.
తమ ముందు ప్రత్యర్థి జట్టు విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది వెస్టిండీస్ (West Indies) . ధాటిగా బదులు ఇచ్చింది వెస్టిండీస్. 411 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
దీంతో రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 185 రన్స్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో జట్టును ఓటమి నుంచి కాపాడే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు క్రెయిగ్ బ్రాత్ వైట్ .
ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా గట్టులా నిలబడ్డాడడు. 184 బాల్స్ ఎదుర్కొన్న స్కిప్పర్ 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
సత్తా చాటాడు. దీంతో మ్యాచ్ లో ఫస్ట్ , రెండో ఇన్నింగ్స్ లు కలిపి 216 పరుగులు చేశాడు. దీంతో మనోడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Also Read : క్రికెట్ దిగ్గజానికి కన్నీటి వీడ్కోలు