Petrol Price Hike : దేశంలో తాజాగా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కంటే ముందు నిత్యం వాడే పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Price Hike)తగ్గించింది తెలివిగా మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్. ఎన్నికల పర్వం ముగిసింది.
నాలుగు రాష్ట్రాలలో మరోసారి బీజేపీ పవర్ లోకి వచ్చింది. ఇక అనుకున్న టాస్క్ పూర్తయింది.
ఇంకేం కోట్లాది మంది వాహనదారులు వాడే పెట్రోల్, డీజిల్ ధరలకు(Petrol Price Hike) రెక్కలు వచ్చాయి.
దేశ వ్యాప్తంగా వీటి ధరలు పెంచుతూ గ్యాస్, ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 5 నెలల తర్వాత తిరిగి పెట్రోల్, డీజిల్ ధరలను చమరు సంస్థలు పెంచాయి.
ఇదంతా కేవలం ఎన్నికల వరకేనని జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ముందే ట్యాంకులు నింపుకోండి అంటూ ఆయన సూచించారు. ఇక మన రాష్ట్రంలో పెట్రోల్ పై 90 పైసలు పెరిగింది.
డీజిల్ పై 87 పైసలు పెంచాయి. ప్రస్తుతం పెరిగిన ధరలు చూస్తే హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 109.10 కాగా డీజిల్ ధర రూ. 95.49 గా ఉంది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ పై 88 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగాయి.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.80 గా ఉండగా డీజిల్ ధర రూ. 96.83 గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.21 గా ఉంటే ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.82 ఉండగా డీజిల్ ధర రూ. 95.00 గా ఉంది.
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.51 గా ఉండగా డీజిల్ ధర రూ. 90.82 ఉంది. చెన్నైలో రూ. 102.16 , డీజిల్ ధర రూ. 92.19 గా ఉంది.
Also Read : యూనికార్న్ కంపెనీపై ఐటీ దాడులు