Jhulan Goswami : భారత వెటరన్ క్రికెటర్ , బౌలర్ ఝులన్ గోస్వామి సంచలనం సృష్టించారు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళా వన్డే క్రికెట్ టోర్నీలో అరుదైన ఘనత సాధించారు.
ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత జట్టు 110 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ఝులన్ గోస్వామి(Jhulan Goswami) ప్రత్యర్థి జట్టులో ఇద్దరు బ్యాటర్ లను అవుట్ చేసింది.
దీంతో వరల్డ్ కప్ లో 30 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా వన్డే ఫార్మాట్ లో 250 వికెట్లు తీసిన ఏకైక భారత మహిళా క్రికెటర్ గా ఇప్పటికే చరిత్ర నమోదు చేసింది ఝులన్ గోస్వామి(Jhulan Goswami).
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుతంగా రాణిస్తే యస్తికా భాటియా ఆఖరులో వచ్చి దంచి కొట్టింది.
ఈ ముగ్గురు ఇన్నింగ్స్ లో కీలక భూమిక పోషిస్తోంది. ఇక భారత మహిళా జట్టు స్కిప్పర్ మిథాలీ రాజ్ కు కెరీర్ పరంగా ఇదే ఆఖరు టోర్నీ. తాను ఇక ఆటకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించింది.
ప్రపంచంలో టాప్ ప్లేయర్లలో ఒక క్రికెటర్ గా పేరొందారు మిథాలీ రాజ్. వరుసగా ఆరు వరల్డ్ కప్ లలో పాల్గొని రికార్డు సృష్టించింది.
అన్ని ఫార్మాట్ లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా పేరు నమోదు చేసింది. ఇక ఝులన్ గోస్వామికి ఈ వరల్డ్ కప్ ఐదోది కావడం విశేషం.
Also Read : శాంసన్ టార్చ్ బేరర్ మ్యాచ్ విన్నర్