Zelensky : రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్నది ఉక్రెయిన్ పై. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శరణార్థులుగా మారారు.
దిక్కు తోచని స్థితిలో ఆ దేశం కొట్టు మిట్టాడుతోంది. బాంబుల మోతతో,
క్షిపణుల దాడులతో నిన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న ఆ సువిశాల ప్రాంతం ఇప్పుడు వల్లకాడును తలపింప చేస్తోంది.
ఇది యుద్దం కాదని కేవలం సైనిక చర్య మాత్రమేనని ప్రకటిస్తూ వచ్చిన రష్యా చీఫ్ పుతిన్ మాటలు నీటి మూటలేనని తేలి పోయింది.
కట్టు కథలకు, మాయ మాటలకు, దొంగ దెబ్బకు పెట్టింది పేరు పుతిన్.
కేవలం తన మాట వినడం లేదని, పక్కలో బల్లెంలా తయారయ్యాడని, అమెరికా, యూరోపియన్ కంట్రీస్ మద్దతు పలుకుతున్నాయనే
ఒకే ఒక్క కారణం బూచి చూపి సభ్య సమాజం, సమస్త ప్రపంచం తల దించుకునేలా,
మానవత్వం మంట గలిసేలా, నిస్సిగ్గుగా దాడులకు పాల్పడుతోంది రష్యా.
అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన రష్యా. కమ్యూనిజానికి పెట్టని కోట గోడలా ఉన్న మాస్కో విను వీధుల్లో నిరసనలు మిన్నంటాయి.
అందమైన భవంతుల్లో సేద దీరుతున్న రాజ పాలకుడికి ఇవేమీ అర్థం కావు.
ఎందుకంటే తాను అనుకున్నది జరుగుతోంది కనుక. అభం శుభం తెలియని చిన్నారులపై బాంబుల దాడుల్ని , వాళ్ల హాహాకారాల్ని వినే నాథుడే లేకుండా పోయాడు.
ప్రపంచం ఏర్పాటు చేసుకున్న ఐక్య రాజ్య సమితి కోరినా , సాక్షాత్తు వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ నెత్తీ నోరు బాదుకున్నా వినే పరిస్థితిలో లేడు ఈ మూర్ఖపు పుతిన్.
రక్తపు దాహానికి అలవాటు కలిగిన పులి లాంటి మనస్తత్వం కలిగిన దేశాధ్యక్షుడి (Zelensky)ముందు వేదనలు, రోదనలు, కన్నీళ్లు ఎందుకు వినిపిస్తాయి. ఇంకెందుకు కనిపిస్తాయి.
చరిత్ర క్షమించదు పుతిన్. ఈ చీకటి అధ్యాయానికి బాటలు వేసింది నువ్వు. లక్షలాది కళ్లల్లో ఒలికిన కన్నీళ్లు అంతా కలిపితే ఓ జలాశయం అవుతుంది.
మానవ జాతి పై ఏకపక్ష దాడులకు దిగే హక్కు నీకు ఎవరిచ్చారు. ఓ వైపు శాంతి జపం చేస్తూ ఇంకో వైపు దారుణ మారణకాండకు
పాల్పడుతున్న నిన్ను ఈ ప్రపంచం ఎప్పటికీ క్షమించదు.
ఏదీ శాశ్వతం కాదని తెలుసుకో. చివరకు మిగిలేది శాంతి మాత్రమే.
ఇన్ని దాడులకు పాల్పడినా మొక్కవోని ధైర్యాన్ని కలిగిన ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ ఇప్పుడు హీరోగా మారి పోయాడు.
యుద్ధ సమయంలో అతడు చేసిన ప్రసంగాలు లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నాయి.
కంటతడి పెట్టుకునేలా చేస్తున్నాయి. పశ్చిమ దేశాలన్నీ అతడి ప్రసంగాలకు జేజేలు పలుకుతున్నారు.
ఇవాళ ఫ్రెంచ్, జపనీస్ చట్ట సభ సభ్యులతో చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు.
వర్చువల్ గా మాట్లాడిన జెలెన్ స్కీ(Zelensky) మీరు మాతో ఉన్నామని భరోసా ఇవ్వమని కోరాడు.
44 ఏళ్ల మాజీ టీవీ నటుడు రష్యాపై పోరాటాన్ని యూరోపియన్ ఆదర్శాలను రక్షించే పోరాటంగా మార్చేశాడు. దీని కోసం ఉక్రెనియన్లు గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు.
Also Read : ‘స్వామి శివానంద’ స్మరామీ