Rohit Sharma : ఇషాన్ కిష‌న్ తో క‌లిసి ఓపెనింగ్

ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ

Rohit Sharma  : ముంబై వేదిక‌గా ఐపీఎల్ (IPL) సంబురం ప్రారంభం కానుంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగే ఈ మెగా రిచ్ లో 10 జ‌ట్లు పాల్గొంటున్నాయి.అన్ని జ‌ట్లు నెట్ ప్రాక్టీస్ లో మునిగి పోయాయి.

ఇక క‌రోనా కార‌ణంగా కేవ‌లం 25 శాతం మంది ప్రేక్ష‌కుల‌కే చూసేందుకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. ఇదిలా ఉండ‌గా ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma )ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

జ‌ట్టుకు సంబంధించి తాను ఇషాన్ కిష‌న్ తో క‌లిసి ఓపెనింగ్ కు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ర‌న్స్ ఎక్కువ‌గా సాధించాలంటే హిట్ట‌ర్ కావాల్సి ఉంటుంది. సిక్స‌ర్ల‌ను అల‌వోకగా కొట్టే వారిలో రోహిత్ శ‌ర్మ‌తో (Rohit Sharma )పాటు కిష‌న్ కూడా ఆరి తేరాడు.

దీంతో త‌న జ‌ట్టుకు సంబంధించి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలిపాడు. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు కు విజ‌యాలు అందించిన జోష్ లో ఉన్న రోహిత్ శ‌ర్మ ఇప్పుడు ఐపీఎల్ (IPL) 15వ సీజ‌న్ పై క‌న్నేశాడు.

2021లో జ‌రిగిన 14 వ సీజ‌న్ ఐపీఎల్ (IPL) లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున రోహిత్ శ‌ర్మ క్వింట‌న్ డికాక్ (Quinton de Kock) తో క‌లిసి ఓపెనింగ్ కు వ‌చ్చాడు. ఈసారి ప్లేస్ మార్చేశాడు.

ఎవ‌రు వ‌స్తార‌నే దానిపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు ఇవాల్టితో తెర దించాడు రోహిత్ శ‌ర్మ‌. హెడ్ కోచ్ మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే ఇదే విష‌యాన్ని రివీల్ చేశాడు.

ఈసారి వారిద్ద‌రూ త‌మ‌దైన శైలిలో రాణిస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. అద్బుత‌మైన ఆట‌గాళ్లు ఇప్పుడు ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) లో చేరారు. గ‌తంలో ప‌లు సార్లు ఐపీఎల్ (IPL) టైటిల్ ను స్వంతం చేసుకున్న చ‌రిత్ర ఆ జ‌ట్టుకుంది.

Also Read : ఐపీఎల్ ఫ్యాన్స్ కు తీపిక‌బురు

Leave A Reply

Your Email Id will not be published!