Chennai Super Kings 2022 : ముంబై వేదికగా జరిగే ఐపీఎల్ -2022 (IPL-2022) రిచ్ లీగ్ లో హాట్ ఫెవరేట్ టీం ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అని చెప్పక తప్పదు.
ఎలాంటి తొట్రు పాటు లేకుండా కూల్ గా తమ పని తాము చేసుకుంటూ ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వడంలో సీఎస్కే తర్వాతే ఏదైనా.
గత ఏడాది ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకు పోయిన ఆ జట్టుకు కర్త కర్మ క్రియ అన్నీ అతడే జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).
వత్తిళ్లు ఎన్ని ఉన్నా విజయం వరించేంత దాకా నిద్రపోని మనస్తత్వం అతడిది.
మరోసారి టైటిల్ సాధించాలనే కసితో ఉన్నాడు ధోనీ. ఐపీఎల్ పరంగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings 2022)చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తుంది.
2008లో దీనిని ఏర్పాటు చేశారు. ఇండియా సిమెంట్స్ ప్రధాన వాటాదారుగా ఉంది ఈ జట్టు ఫ్రాంచైజీ.
రెండేళ్ల పాటు నిషేధానికి గురైంది సీఎస్కే. బెట్టింగ్ కుంభకోణం కారణంగా. 2018లో రీ ఎంట్రీ ఇచ్చి కామ్ గా టైటిల్ ఎగరేసుకు పోయింది.
2021లో దుబాయిలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ టైటిల్ ను కూడా స్వంతం చేసుకుంది ధోనీ నేతృత్వంలోని సీఎస్కే(Chennai Super Kings 2022).
2022కు సిద్దమవుతోంది. ఇక ఈ జట్టు మొట్ట మొదటి యూనికార్న్ స్పోర్ట్స్ ఎంటర్ ప్రైజ్ గా అవతరించింది.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 14 సార్లు టోర్నీ జరిగితే సీఎస్కే నాలుగు సార్లు గెలుపొందింది. 2010, 2011, 2018, 2021లలో సత్తా చాటింది. ఐపీఎల్ లో అన్ని జట్ల కంటే అత్యధిక విజయపు శాతాన్ని కలిగి ఉంది ఈ టీమ్.
2019లో సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ రూ. 732 కోట్లు అని అంచనా. లండన్ ఆధారిత బ్రాండ్ ఫైనాన్స్ ప్రపంచంలోని టాప్ 150 అత్యంత విలువైన జట్లను అంచనా వేసింది. ఇందులో సీఎస్కే 147వ స్థానంలో ఉంది.
ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే మరోసారి దుమ్ము రేపేందుకు, సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఎలాంటి అద్భుతాలు చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read : ముంబై ఇండియన్స్ సత్తా చాటేనా