Sunrisers Hyderabad 2022 : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎన్నడూ లేనంతగా ఒత్తిడికి లోనవుతోంది. ప్రముఖ మీడిమా, వ్యాపార దిగ్గజంగా పేరొందిన కళానిధి మారన్ తీసుకున్నా ఈరోజు వరకు దాని దశ దిశ మారలేదు.
దిగ్గజ ఆటగాడిగా పేరొందిన డేవిడ్ వార్నర్ (David Warner) ను తప్పించింది. అనేక విమర్శలు మూటగట్టుకుంది.
ముంబై వేదికగా జరగబోయే ఐపీఎల్ (IPL) 2022కి సన్నద్దం అవుతోంది ఆ జట్టు. ఈసారైనా సత్తా చాటుతారో లేదా అన్నది ఆ జట్టు ఫ్యాన్స్ లో నెలకొంది.
అత్యంత పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశ పరిచింది. ఐపీఎల్ (IPL) లో తెలంగాణలోని హైదరాబాద్(Sunrisers Hyderabad 2022 ) నుంచి ఈ జట్టు ప్రాతినిధ్యం వహిస్తోంది. కానీ ఆపరేషన్స్ అంతా చెన్నై కేంద్రంగా నడుస్తోంది.
ఒకప్పుడు దుమ్ము రేపిన ఈ టీం ఇప్పుడు నానా తంటాలు పడుతోంది. 2021లో జరిగిన ఐపీఎల్ (IPL) లో ఘోరమైన ఓటమికి బాధ్యత వహిస్తూ ప్రధాన కోచ్ తో పాటు అసిస్టెంట్ కోచ్ కూడా వైదొలిగారు.
ఇక మెంటార్ గా ఉన్న లక్ష్మణ్ సైతం గుడ్ బై చెప్పాడు జట్టుకు. టామ్ మూడీని సన్ రైజర్స్(Sunrisers Hyderabad 2022 ) యాజమాన్యం ప్రధాన కోచ్ గా , సైమన్ కటిచ్ అసిస్టెంట్ కోచ్ గా నియమించింది.
డేల్ స్టెయిన్ , బ్రియాన్ లారా , హేమంగ్ బదానీలు కూడా కీలక పాత్ర పోషించనున్నారు.
బయో బబుల్ కారణంగా కటిచ్ తప్పుకోవడంతో యాజమాన్యం హెల్మోట్ ను అతడి స్థానంలో నియమించింది.
గత నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగిన మెగా వేలంలో రూ. 68 కోట్లు వెచ్చించింది. 20 మందిని కొనుగోలు చేసింది.
అత్యధికంగా ఏకంగా విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) ను రూ. 10. 75 కోట్లకు తీసుకుంది.
వార్నర్ సారథ్యంలో ఐపీఎల్ (IPL) టైటిల్ గెలిచిన ఆ జట్టు ఇప్పుడు ముందున్న సవాల్ పోయిన పరువు కాపాడు కోవడం. ఇక జట్టు పరంగా చూస్తే విలయమ్సన్,
సమద్, మాలిక్, సుందర్, పూరన్, నటరాజన్ , భువీ, ప్రియమ్ గార్గ్ , త్రిపాఠి, అభిషేక్ శర్మ, కరక్ త్యాగి ఉన్నారు.
వీరితో పాటు శ్రేయస్ గోపాల్ , సుచిత్ , మార్కరమ్ , జాన్సెన్, రొమారియో, సమర్థ్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్ , విష్ణు వినోద్ , గ్లెన్ ఫిలిప్స్ , ఫరూకీ ఆడనున్నారు.
Also Read : రాజస్థాన్ రాయల్స్ రఫ్ఫాడిస్తారా