RCB IPL 2022 : ప్రపంచంలోని టాప్ ఆటగాళ్లుగా పేరొందిన వారంతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నారు. ఏ జట్టుకు లేని సౌలభ్యం ఈ టీమ్ కు ఉండడం విశేషం.
సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి (RCB IPL 2022)సారథ్యం వహించాడు.
ఇటీవల ఆయన అన్ని ఫార్మాట్ ల కు సంబంధించి స్కిప్పర్ గా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
అతడిని ఇప్పటికీ తాము సారథిగానే భావిస్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఏ క్షణంలో నైనా మ్యాచ్ ల పరిస్థితిని మార్చగల సత్తా కలిగిన ఆటగాళ్లు ఉన్న జట్టు ఇది. ప్రస్తుతానికి ఆర్సీబీకి (RCB IPL 2022)కోచ్ గా సంజయ్ భంగర్ ఉన్నాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ తప్పు కోవడంతో యాజమాన్యం డుప్లెసిస్ ను కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బెంగళూరు వేదిక నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఈ జట్టులో వరల్డ్ వైడ్ గా ప్రభావితం చేసే ఆటగాళ్లు ఉన్నారు. ఇక జట్టు పరంగా చూస్తే బ్యాటర్లుగా విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ , ఫిన్ అలెన్ ఉన్నారు.
వీరు ఏ సమయంలో నైనా దుమ్ము రేపే సత్తా ఉన్న స్టార్లు. వికెట్ కీపర్లుగా దినేష్ కార్తీక్ , అనుజ్ రావత్ , లువ్నిత్ సిసోడియా ఆడనున్నారు.
ఆల్ రౌండర్లుగా క్లిష్ట సమయంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఆటగాళ్లలో గ్లెన్ మాక్స్ వెల్ , డేవిడ్ విల్లీ, రూథర్ ఫోర్డ్ , వనిందు హసరంగా , హర్షల్ పటేల్ ఉన్నాడు.
వీరితో పాటు షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్ , సుయాష్ ప్రభుదేసాయి, అనీశ్వర్ గౌతమ్ కీలక పాత్ర పోషించనున్నారు.
ఇక జట్టుకు బౌలర్లుగా జోష్ హేజిల్ వుడ్ , జాసన్ బెహ్రెన్ డార్ఫ్ , మహ్మద్ సిరాజ్ , కర్ణ్ శర్మ, సిద్దార్త్ కౌల్ , చామ మిలింద్ , ఆకాశ్ దీప్ జట్టుకు బలమైన శక్తులుగా మారనున్నారు.
ఇందులో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ మారినా ఆర్సీబీ దిశ మారుతుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read : అందరి కళ్లు ఢిల్లీ క్యాపిటల్స్ పైనే