Gujarat Titans 2022 : గుజ‌రాత్ టైటాన్స్ గుబులు పుట్టిస్తారా  

ఐపీఎల్ 2022కు పాండ్యా స‌మాయ‌త్తం 

Gujarat Titans 2022 : ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఆదాయం కలిగిన ఏకైక క్రీడా టోర్నీగా పేరు తెచ్చుకుంది (Indian Premier League) ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్. ఈసారి ముంబై వేదిక‌గా ఈనెల 26 నుంచి ఐపీఎల్ 15 (IPL) వ సీజ‌న్ మెగా రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.

ఇప్ప‌టికే బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. వేల కోట్ల రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూర్చి పెట్టే ఐపీఎల్ పై బ‌డా కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు, సెల‌బ్రెటీలు క‌న్నేశారు.

గ‌తంలో జ‌రిగిన 14 ఐపీఎల్ సీజ‌న్ల‌లో 8 జ‌ట్లు పాల్గొంటే ఈసారి జ‌రిగే ఐపీఎల్ లో అందుకు భిన్నంగా మ‌రో రెండు జ‌ట్లు చేరాయి.

ఒక‌టి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కాగా ఇంకోటి గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans 2022 ). బీసీసీఐ నిర్వ‌హించిన వేలంలో రెండు జ‌ట్ల‌కు క‌లిపి ఏకంగా రూ. 1725 కోట్లు వ‌చ్చాయి.

ఇది న‌మ్మ‌లేని నిజం. ఈసారి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అంత‌గా ఆక‌ట్టుకోని హార్దిక్ పాండ్యాను గుజ‌రాత్ టైటాన్స్ మేనేజ్ మెంట్ తీసుకోవ‌డం క్రీడాభిమానుల్ని విస్తు పోయేలా చేసింది.

సీవీసీ క్యాపిట‌ల్స్ స్వంతం చేసుకుంది ఈ జ‌ట్టును. త‌మ స‌త్తాను చాటేందుకు ఆటగాళ్లు స‌మాయ‌త్తం అవుతున్నారు.

ఈ టీమ్ కు మాజీ క్రికెట‌ర్ ఆశిష్ నెహ్రా చీఫ్ కోచ్ గా ఉండ‌గా స‌ఫారీ ప్లేయ‌ర్ గ్యారీ కిర్ స్టెన్ మెంటార్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వీరిద్ద‌రూ ఎలా త‌మ జ‌ట్టును ముందుకు తీసుకు వెళ‌తారనేది వేచి చూడాలి. ఇదిలా ఉండ‌గా ప‌ది జ‌ట్లు ఒక్కో జ‌ట్టు ప్ర‌తి జ‌ట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. హార్దిక్ తో పాటు స్టార్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ ఉన్నాడు.

ఇక జ‌ట్టులో గిల్ , ష‌మీ, ఫెర్గుస‌న్ , అభిన‌వ్ , రాహుల్ తెవాటియా, నూర్ అహ్మ‌ద్, సాయి కిషోర్ , డ్రేక్స్ ,

జ‌యంత్ యాద‌వ్ , విజ‌య్ శంక‌ర్ , ద‌ర్శ‌న్ న‌ల‌కందే, య‌శ్ ద‌యాల్ , జోసెఫ్ సాంగ్వాన్ , మిల్ల‌ర్ , సాహా, వేడ్ , గురుకీర‌త్ సింగ్ ఆడ‌నున్నారు.

హార్దిక్ తో పాటు మిగ‌తా ఆట‌గాళ్లు రాణిస్తేనే ఈ జ‌ట్టు ఏమైనా స‌త్తా చాటే ఛాన్స్ ఉంది. జ‌ట్టు ఎంపిక‌లో ప్ర‌ధాన బ్యాట‌ర్లు లేక పోవ‌డం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. బౌలింగ్ ప‌ర్వాలేదని అనిపించినా బ్యాటింగ్ వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా పెద్ద దెబ్బ‌. అదే ఆ జ‌ట్టుకు మైన‌స్.

Also Read : ఆర్సీబీని ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్

Leave A Reply

Your Email Id will not be published!