Mayank Agarwal : కేఎల్ రాహుల్ (KL Rahul) తప్పుకోవడంతో ఊహించని రీతిలో మయాంక్ అగర్వాల్ కు ఛాన్స్ దక్కింది. ఈసారి జరుగుతున్న ఐపీఎల్ (IPL) లో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. కర్ణాటక లోని బెంగళూరులో 1991 ఫిబ్రవరి 16న పుట్టారు.
కుడి చేతి వాటం బ్యాటర్. ఓపెనర్ గా ఇప్పటికే రాణించాడు. 2018 డిసెంబర్ 26న ఆసిస్ తో టెస్టు అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో 2022 మార్చి 12న ఎంటర్ అయ్యాడు. 2010లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
2011-2013 దాకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. 2014-2016 దాకా ఢిల్లీ డేర్ డెవిల్స్ కు , 2017లో పూణే సూపర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
స్కిప్పర్ గా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తరపున ఐపీఎల్ (IPL) లో ఎంట్రీ ఇవ్వ బోతున్నాడు. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) తండ్రి అనురాగ్ అగర్వాల్ మిలియన్ల హెల్త్ కేర్ కంపెనీ నేచురల్ రెమెడీస్ కి సిఇఓగా ఉన్నారు. జైన్ యూనివర్శిటీలో చదివాడు.
అక్కడ కేఎల్ రాహుల్ (KL Rahul) , కరణ్ నాయర్ లు సహచరులుగా ఉన్నారు. 2008-2009, 2010 ఐసీసీ అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ లో అండర్ -19 ఇండియా తరపున ఆడాడు మయాంక్ అగర్వాల్(Mayank Agarwal). భారత జట్టు తరపున అత్యధిక రస్న్ చేసిన ఆటగాడగా నిలిచాడు.
2010లో జరిగిన కర్ణాటక ప్రిమీయర్ లీగ్ లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపికయ్యాడు. 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. 50వ ట్రిపుల్ సెంచరీ చేయడం విశేషం. రంజీలో కూడా అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
విజయ హజారేలో సైతం సత్తా చాటాడు. 2020న షార్జాలో రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తరపున సెంచరీ చేశాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కు 13వ కెప్టెన్ గా ఉన్నాడు.
ఏకంగా పంజాబ్ అతడికి రూ. 12 కోట్లు చెల్లించింది. బ్రాండ్ వాల్యూ బాగానే ఉంది. రూ. 26 కోట్లుగా ఉందని అంచనా.
Also Read : ఇషాన్ కిషన్ తో కలిసి ఓపెనింగ్