Ravindra Jadeja : డైన‌మెట్ లాంటోడు జ‌డేజా

అంచ‌నా వేయ‌డం క‌ష్టం

Ravindra Jadeja : ర‌వీంద్ర జ‌డేజా జీవితంలో ఊహించ‌ని రీతిలో అవ‌కాశం ద‌క్కింది. మ‌హేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)  వార‌సుడిగా ముంబై వేదిక‌గా ప్రారంభ‌మైన ఐపీఎల్ (IPL) లో స‌త్తా చాటేందుకు రెడీ అయ్యాడు.

టోర్నీలో భాగంగా అనుకోని రీతిలో తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ధోనీ.

బ్యాట‌ర్ గా, బౌల‌ర్ గా మ్యాచ్ ను శాసించ గ‌లిగిన అతి కొద్ది మంది ఆట‌గాళ్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) ఒక‌డు.

అత‌డ‌ని అంతా జ‌డ్డూ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1988 డిసెంబ‌ర్ 6న పుట్టాడు. మిడిల్ ఆర్డ‌ర్ లో కీల‌క‌మైన బ్యాట‌ర్ గా ఎదిగాడు.

ప్ర‌స్తుతం ధోనీ త‌ప్పుకోవ‌డంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం జ‌డేజాకు (Ravindra Jadeja)స్కిప్ప‌ర్ గా అవకాశం ఇచ్చింది.

ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లో సౌరాష్ట్ర‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. భార‌త క్రికెట్ జ‌ట్టులో అన్ని ఫార్మాట్ ల త‌ర‌పున ఆడాడు.

కీల‌కమైన ప్లేయ‌ర్ గా పేరొందాడు. 2008లో జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్ గెలుచుకున్న భార‌త్ అండ‌ర్ -19 జ‌ట్టులో జ‌డేజా స‌భ్యుడు.

2009 ఫిబ్ర‌వ‌రి 8న శ్రీ‌లంక‌పై వ‌న్డే మ్యాచ్ లో త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు. 77 బంతుల్లో 60 ప‌రుగులు చేశాడు. 2012 డిసెంబ‌ర్ 13న ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ ప్రారంభించాడు.

2012లో సీఎస్కే జ‌డేజాను కొనుగోలు చేసింది. 2016లో గుజ‌రాత్ ల‌య‌న్స్ రూ. 9.5 కోట్ల‌కు తీసుకుంది. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ లో టాప్ బౌల‌ర్ గా ఉన్నాడు. 2022లో భారీ ధ‌ర‌కు సీఎస్కే చేజిక్కించుకుంది.

అత‌డిని తీసుకోవ‌డంలో ధోనీ పాత్ర ఉంది. త‌న వార‌సుడిగా ప్ర‌క‌టించాడు. ఐపీఎల్ (IPL) లో మొద‌ట‌గా 2008లో రాజస్థాన్ రాయ‌ల్స్ కు ఎంపిక‌య్యాడు. ఆ జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డంలో ముఖ్య పాత్ర పోషించాడు జ‌డ్డూ.

మేకింగ్ లో సూప‌ర్ స్టార్ అన్నాడు దివంగ‌త దిగ్గ‌జ ఆట‌గాడు షేన్ వార్న్. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ (IPL) లో ఏ మేర‌కు సీఎస్కేను తీసుకు వెళ‌తాడ‌నేది ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : మ్యాచ్ విన్న‌ర్ రిష‌బ్ పంత్

Leave A Reply

Your Email Id will not be published!