IPL 2022 : బారత క్రికెట్ కంట్రోల్ బోర్డు – బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. 2008లో ఇండియన్ ప్రిమీయర్ లీగ్(IPL 2022) ప్రారంభమైంది. ఇప్పుడు ఇప్పటి వరకు 14 సీజన్లు ముగిశాయి.
ఈనెల 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ షురూ అవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన టోర్నీగా ఐపీఎల్ నిలిచింది.
గతంలో ఎనిమిది జట్లు పాల్గొనగా గత ఏడాది బీసీసీఐ నిర్వహించిన వేలం పాటలో రెండు జట్లు అదనంగా చేరాయి.
రెండింటి జట్లతో రూ. 1725 కోట్ల ఆదాయం సమకూరింది. ఐపీఎల్ టోర్నీ పరంగా దాదాపు అనధికారిక అంచనా ప్రకారం వేల కోట్లు రానున్నాయి.
ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే బీసీసీఐ ఇప్పుడు ఆదాయ పరంగా టాప్ లో కొనసాగుతోంది.
ఐపీఎల్ పుణ్యమా అని వర్దమాన క్రికెటర్లు కరోడ్ పతులయ్యారు. ఆయా జట్ల ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి. ఒక్కో ఆటగాడి దిశ దశ మారుతోంది ఐపీఎల్ పుణ్యమా అని. విచిత్రం ఏమిటంటే ఎవరూ ఊహించని రీతిలో ఈసారి కేఎల్ రాహుల్ ను రూ. 17 కోట్లకు తీసుకుంది లక్నో జెయింట్స్ .
గత ఏడాది కరోనా కారణంగా దుబాయి వేదికగా ఐపీఎల్ లీగ్ (IPL 2022)జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ కేకేఆర్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
ఈసారి పది జట్లు పాల్గొంటున్న ఐపీఎల్ లో ఇప్పటి దాకా చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ అత్యధిక టైటిళ్లు గెలుపొందింది. టీ20 ఫార్మాట్ ప్రకారం ఐపీఎల్ నిర్వహిస్తున్నారు.
ఇక ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 6 వేల 283 పరుగులు చేశాడు. ఇక లలిత్ మళింగ 176 వికెట్లు తీసి టాప్ లో నిలిచాడు. ప్రతి ఏటా మార్చి నుంచి మే దాకా ఈ రిచ్ లీగ్ జరుగుతుంది.
సీఎస్కేకు ధోనీ రిజైన్ చేయడంతో రవీంద్ర జడేజా సారథ్యం వహిస్తుండగా ఆర్ ఆర్ కు సంజూ శాంసన్ , కేకేఆర్ కు శ్రేయస్ అయ్యర్, లక్నో కు కేఎల్ రాహుల్ , ఆర్సీబీకి డుప్లెసిస్ సారథ్యం వహిస్తున్నారు.
ఇక పంజాబ్ కింగ్స్ కు మయాంక్ అగర్వాల్ , రాజస్థాన్ టైటాన్స్ కు పాండ్యా , ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నారు.
సన్ రైజర్స్ కు కేన్ విలియమ్సన్ కెప్టెన్ కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషబ్ పంత్ ఉన్నారు. ముంబై వేదికగా ఈ రిచ్ లీగ్ కొనసాగుతుంది.
Also Read : గుజరాత్ టైటాన్స్ గుబులు పుట్టిస్తారా