Petrol Hike : ఎన్నికలు ముగిశాయి. ఆయిల్ , గ్యాస్ కంపెనీలు ధరా భారాన్ని మోపుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరగకుండా ఉంచిన కంపెనీలు ఉన్నట్టుండి మోత మోగిస్తున్నాయి.
వరుసగా నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Hike)పెంచడంతో వాహనదారులు వాపోతున్నారు. ఇంధన ధరల పెరుగుదలకు తాము బాధ్యులం కామని కంపెనీలు అంటున్నాయి.
ప్రపంచ మార్కెట్ లో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా తాము ధరలు పెంచాల్సి వస్తుందని స్పష్టం చేశాయి. తాజాగా పెంచిన ధరలతో జనం బెంబేలెత్తి పోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 98.61 కాగా డీజిల్ ధర రూ. 89.67 గా ఉంది. ఇక తాజాగా కంపెనీలు పెట్రోల్, డీజిల్ లీటరుకు 80 పైసల పెంచాయి. నాలుగు రోజుల నుంచి చూస్తే రూ. 3.20కి పెరిగాయి.
యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, ఉత్తర ప్రదేశ్, గోవా రాష్ట్రాల లో ఎన్నికల సందర్భంగా ఆయిల్ ధరలు పెరగలేదు. ఎన్నికలు ముగియడంతో కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పెంచేందుకు దీంతో ఆయిల్ కంపెనీలు ధరలు(Petrol Hike) మోపడంలో స్పీడ్ పెంచాయి.
ధరలను అదుపు చేయాల్సిన కేంద్ర సర్కార్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది.
ప్రభుత్వ ఆధీనంలోని ఇంధన రిటైలర్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) – ఐఓస , భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (Bharat Petroleum Corporation) లిమిటెడ్- బీపీసీఎల్ , హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – హెచ్ పీసీఎల్ కలిసి పెట్రోల్ నిల్వ చేయడం వల్ల దాదారు రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : లావాదేవీలలో హైదరాబాద్ టాప్