Pakistan Assembly : పాకిస్తాన్ అసెంబ్లీ వాయిదా

28న అవిశ్వాస తీర్మానంకు ఓకే

Pakistan Assembly  : విప‌క్షాల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. పాకిస్తాన్ అసెంబ్లీ వాయిదా ప‌డింది. ఈనెల 28న పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం కు ఓకే చెప్పింది.

69 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఇమ్రాన్ ఖాన్ సంకీర్ణ ప్ర‌భుత్వానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ధానిగా కొన‌సాగుతున్నారు. కొంత మంది భాగ‌స్వామ్య ప‌క్షాలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించు కున్నాయి.

దీంతో ప్ర‌భుత్వం మైనార్టీలో ప‌డింద‌ని ఆయ‌న‌కు పీఎంగా కొన‌సాగే నైతిక హ‌క్కు కోల్పోయారంటూ విప‌క్షాలు మండిప‌డ్డాయి. ఈ మేర‌కు కోర్టుకు ఎక్కాయి. అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాల్సిందేనంటూ పేర్కొన్నాయి.

ఇవాళ విశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రావాల్సి ఉంది. కానీ అనుకోని రీతిలో పాకిస్తాన్ అసెంబ్లీ(Pakistan Assembly )ఎలాంటి చ‌ర్చ ప్ర‌తిపాద‌న లేకుండానే వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌కటించింది. దీనిపై తీవ్రంగా అభ్యంత‌రం తెలిపాయి విప‌క్షాలు.

విప‌క్షాల శాస‌న‌స‌భ్యుల తీవ్ర నిర‌స‌నల మ‌ధ్య పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ కీల‌క‌మైన ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌కుండానే వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

గ‌త నెల ఫిబ్ర‌వ‌రి 14న పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఎమ్మెల్యే ఖ‌యాల్ జ‌మాన్ మ‌ర‌ణించారు. ఆయ‌న మృతికి సంతాప సూచ‌కంగా స‌మావేశాన్ని ఈనెల 28 సాయంత్రం 4 గంట‌ల‌కు వాయిదా వేసిన‌ట్లు నేష‌న‌ల్ అసెంబ్లీ స్పీక‌ర్ అస‌ద్ ఖైజ‌ర్ ప్ర‌క‌టించారు.

వాయిదా వేయ‌డాన్ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు తీవ్ర నిర‌స‌న తెలిపారు. వ‌చ్చే సెష‌న్ లో అవిశ్వాస తీర్మానంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు స్పీక‌ర్.

Also Read : ఆడ‌పిల్ల‌లకు హైస్తూల్ విద్య అవ‌స‌రం లేద‌ట‌

Leave A Reply

Your Email Id will not be published!