CSK vs KKR : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబై వేదికగా జరిగిన మొదటి లీగ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్(CSK vs KKR) మధ్య జరిగింది. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో బరిలోకి దిగిన సీఎస్కే గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. వికెట్లు కోల్పోయిన సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రంగంలోకి దిగాడు జట్టును ఆదుకున్నాడు.
హాఫ్ సెంచరీ చేశాడు. వాంఖడే స్టేడియంలో నువ్వా నేనా అన్న రీతిలో ఆట కొనసాగింది. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర జడేజా 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
కేకేఆర్ బౌలర్లు ఫస్ట్ సెషన్ లోనే ప్రభావం చూపించారు. మొదటి ఓవర్ లోనే రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. ఈ తరుణంలో కేకేఆర్ బౌలర్ల దెబ్బకు 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన ధోనీ , రవీంద్రా జడేజా కలిసి కేకేఆర్ బౌలర్లను అడ్డుకున్నారు. పరుగులు చేశారు. ఇక కేకేఆర్ తరపున ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ చెరో వికెట్ తీశారు.
కేకేఆర్ ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకుంది. సామ్ బిల్లింగ్స్ , ఆండ్రీ రస్సెల్ , సునీల్ సరైన్ ను ఎంపిక చేసింది. ఇక సీఎస్కే డేవాన్ కాన్వే, మిచెల్ సాంట్నరన్ , డ్వేన్ బ్రావో , ఆడమ్ మిల్నే లను తీసుకుంది.
ఇదిలా ఉండగా కేకేఆర్ తరపున అయ్యర్, రహానే, శ్రేయాస్ , నితీష్ రాణా, సామ్ , రస్సెల్, సరైన్ , జాక్సన్ , ఉమేష్ యాదవ్ , శివం మావి, వరుణ్ చక్రవర్తి ఆడుతున్నారు.
Also Read : మిథాలీ రాజ్ సేనకు అగ్ని పరీక్ష