Ness Wadia : త్వరలో ఇండియాలో మహిళా ఐపీఎల్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ నిర్ణయించింది. ఈ తరుణంలో ఇప్పటికే పురుష ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆడుతోంది.
ఆ జట్టు ఫ్రాంచైజీ సహ యజమాని ( కో ఓనర్ ) నెస్ వాడియా ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఐపీఎల్ మహిళా జట్లలో ఒక జట్టును తీసుకునేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు.
బహుషా విమెన్స్ ఐపీఎల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దీంతో ప్రతిపాదిత మహిళల ఐపీఎల్ లో తమ జట్టును స్వంతం చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ రెడీగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు నెస్ వాడియా(Ness Wadia ).
గత వారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పోటీలో భాగం కావడానికి ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలు మొదటి ప్రాధాన్యతలో వచ్చే ఏడాదికి 5 నుంచి ఆరు టీమ్ లు మహిళల ఐపీఎల్ చేపట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.
గతంలో కంటే ఇప్పుడు మహిళా క్రికెట్ అభివృద్ది చెందింది. దీంతో తాము ఆ జట్లలో ఏదో ఒక జట్టును స్వంతం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆ క్రికెట్ కొనసాగుతూ వస్తోందన్నారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ జరుగుతోంది. కానీ భారత మహిళా జట్టు ఓడి పోవడం బాధ కలిగించిందన్నాడు. కానీ మన అమ్మాయిలు ప్రదర్శించిన పోరాటం గొప్పదన్నాడు.
తనను విస్తు పోయేలా చేసిందన్నాడు నెస్ వాడియా. అయితే బేస్ ధర ఎంత అనేది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంటుందన్నాడు.
Also Read : నూతన చరిత్ర సృష్టించిన సింధు!