GT vs LSG IPL 2022 : ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో భాగంగా ఇవాళ రెండు కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. పంజాబ్ కింగ్స్ కు సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ లక్నో జెయింట్స్ కు మారాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో జెయింట్స్(GT vs LSG IPL 2022 )ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును గౌరవ ప్రదమైన స్కోర్ చేసేలా గట్టెక్కించారు బడోని, దీపక్ హుడా.
లక్నో సూపర్ జెయింట్స్ తరపున వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. మొదటి ఆరు ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. ఎవరూ లక్నో సూపర్ జెయింట్స్ 150 పరుగలు దాటుతుందని అనుకోలేదు.
దీపక్ హూడా, ఆయుష్ బడోని గుజరాత్ టైటాన్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో కేఎల్ రాహుల్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
బడోని 54 పరుగులకే అవుట్ కాగా హుడా 55 రన్స్ చేసి నిష్క్రమించాడు. అంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ టాప్ ఆర్డర్ కు చుక్కలు చూపించాడు మహ్మద్ షమీ. షమీ బౌలింగ్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కేఎల్ రాహుల్ , క్వింటన్ డికాక్ , మనీష్ పాండేలను షమీ అవుట్ చేశాడు. వరుణ్ ఎవిన్ లూయిస్ వికెట్ తీశాడు. దీంతో పవర్ ప్లే లో నాలుగు వికెట్లు కోల్పోయింది.
Also Read : ఆర్సీబీకి బిగ్ షాక్ పంజాబ్ విక్టరీ