Raj Subramaniam : ప్రపంచ కంపెనీలలో టాప్ కంపెనీగా పేరొందిన అమెరికాకు చెందిన ఫెడెక్స్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రవాస భారతీయుడు రాజ్ సుబ్రమణ్యం (Raj Subramaniam )కొలువు తీరనున్నారు. యూఎస్ బహుళజాతి కొరియర్ డెలివరీ దిగ్గజ కంపెనీగా పేరొందింది ఫెడెక్స్ కు.
ఇప్పటి వరకు సదరు సంస్థకు చైర్మన్ , సిఇఓగా ఉనన ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ వైదలగనున్నారు. ఆయన స్థానంలో రాజ్ సుబ్రమణ్యం వచ్చే జూన్ 1 నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించనునన్నారు.
ప్రస్తుతం ఫెడెక్స్ కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉంటారు. ఈ సందర్భంగా ప్రస్తుతం చైర్మన్ , సిఇఓ ఫ్‌రెడరిక్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాజ్ సుబ్రమణ్యం అద్భుతమైన నాయత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఇప్పటికే ఫెడెక్స్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. రాజ్ సుబ్రమణ్యం(Raj Subramaniam )కొలువు తీరాక, ఆయన సారథ్యంలో సదరు కంపెనీ మరింత విజయవంతంగా నడుస్తుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
తన కొత్త పాత్రలో బోర్డ్ గవర్నన్సెతో పాటు సుస్థిరత, ఆవిష్కరణ , పబ్లిక్ పాలసీతో సహా ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు స్మిత్.
ఇదిలా ఉండగా ఫ్రెడరిక్ స్మిత్ 1971లో ఫెడెక్స్ కంపెనీని స్థాపించాడు. అయితే ఫ్రెడరిక్ స్మిత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్ సుబ్రమణ్యం. ఫ్రెడ్ ఒక దార్శనికత కలిగిన నాయకుడు.
వ్యాపార ప్రపంచానికి దిగ్గజం. ప్రపంచంలో గొప్ప, అత్యంత ఆరాధించే కంపెనీలలో ఒక దానిని స్థాపించాడు. ఆ పాత్రలో అడుగు పెట్టడం తనకు సవాల్ కానుందని పేర్కొన్నాడు.
Also Read : లావాదేవీలలో హైదరాబాద్ టాప్