Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించి ఓ అడుగు ముందుకు వేసింది. ఆయా శాఖలలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఉద్యోగుల క్రమబద్దరీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసింది.
ఈ మేరకు వివరాలు ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్ , రూల్ ఆఫ్ రిజర్వేషన్లను అనుసరించి ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయనున్నారు.
ఇందుకు సంబంధించి వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఇక నుంచి రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులంటూ (Telangana Govt)ఉండరని అసెంబ్లీ సాక్షిగా ఈనెల 9న సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇందులో భాగంగా 11, 103 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరనుంది. రాష్ట్రంలో ఏర్పాటైన సందర్భంగా 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు పద్దతిన చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. కొందరు కోర్టుకు ఎక్కడంతో ఆ నిర్ణయం వాయిదా పడింది.
దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టులో పోరాటం చేసింది. చివరకు కోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఇబ్బంది తొలగి పోయింది.
ఇక నుంచి రాష్ట్రంలో కాంట్రాక్టు పద్దతిలో (Telangana Govt)ఉద్యోగ నియామకాలు ఉండవని సీఎం ప్రకటించారు.
2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపించాలని ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో 91, 142 పోస్టులు ఖాళీలు ఉన్నాయని వీటిలో 11, 103 కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు సీఎం.
ఇక మిగిలిన 80 వేల 39 పోస్టులను ప్రత్యక్ష పద్దతిన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు సీఎం.
Also Read : నిరుద్యోగుల కోసం స్టడీ సెంటర్లు