Yuxvendra Chahal : రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించాడు యజ్వేంద్ర చహల్(Yuxvendra Chahal ). మనోడిని గత నెల 12, 13లలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ప్రత్యేకించి చహల్ ను తీసుకుంది.
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలో జరిగిన లీగ్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతే కాదు ఐపీఎల్ , టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ లో ఏకంగా 250 వికెట్లు తీసి అరుదైన చరిత్ర సృష్టించాడు.
ఈ రిచ్ లీగ్ లో చహల్ నాలుగో బౌలర్ కావడం విశేషం. యజ్వేంద్ర చహల్ (Yuxvendra Chahal )కేవలం 4 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చాడు. ప్రధాన ఆటగాళ్లను పెవిలియన్ బాట పట్టించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన షెఫర్డ్ ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఇదిలా ఉండగా గతంలో భారత్ నుంచి టీ20 ఫార్మాట్ లో 250 వికెట్ల మార్క్ ను అందుకున్న వారిలో ఇంతకు ముందు పీయూష్ చావ్లా ఉన్నాడు.
అతను మొత్తం 262 వికెట్లు తీశాడు. ఇక ఇదే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇటీవల భారీ ధరకు కొనుగోలు చేసిన రవిచంద్రన్ అశ్విన్ 264 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. అశ్విన్ తో పాటు అమిత్ మిశ్రా 260 వికెట్లు తీశాడు.
ఎస్ఆర్హెచ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఏమాత్రం ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా కట్టడి చేశాడు యజ్వేంద్ర చహల్. అరుదైన ఘనతను సాధించిన చహల్ ను కెప్టెన్ శాంసన్, మెంటార్ సంగక్కర, మేనేజ్ మెంట్ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : చరిత్ర సృష్టించనున్న స్టార్ హిట్టర్