AUSW vs WIW : ఐసీసీ (ICC) మహిళా వన్డే వరల్డ్ కప్ (Women’s World Cup) లో ఆస్ట్రేలియా (Australia) తన జైత్రయాత్రను కంటిన్యూ చేస్తోంది. సెమీ ఫైనల్ లో వెస్టిండీస్ (AUSW vs WIW )ను మట్టి కరిపించి తనకు ఎదురే లేదని చాటింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ ఓడి పోలేదు.
కంటిన్యూగా విజయం సాధిస్తూ చరిత్ర సృష్టించింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటుతోంది. అన్ని ఫార్మాట్ లలో ఆసిస్ (Australia) దుమ్ము రేపుతోంది. ఇదిలా ఉండగా న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది.
వర్షం కారణంగా మ్యాచ్ ను 45 ఓవర్లకు కుదించారు అంపైర్లు. అయితే విండీస్ జట్టు (AUSW vs WIW )టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన ఆసిస్ (Australia) ఓపెనర్లు హేన్స్ , హేలీ చెడుగుడు ఆడారు. విండీస్ మహిళా (Women) బౌలర్ల భరతం పట్టారు.
గ్రౌండ్ నలువైపులా కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నారు. హేన్స్ 85 రన్స్ చేస్తే హేలీ ఏకంగా 129 పరుగులు చేసి దుమ్ము రేపారు. ఆ తర్వాత వచ్చిన మూనీ 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
దీంతో నిర్ణీత 45 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన ఆసిస్ (Australia) ఏకంగా 305 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం బరిలోకి దిగిన విండీస్ ఓపెనర్ డాటిన్ 34 రన్స్ చేయగా హేలి మాథ్యుస్ 34, స్కిప్పర్ టేలర్ 48 పరుగులు చేయగా ఆ తర్వాత వచ్చిన వారంతా చేతులెత్తేశారు.
పెవిలియన్ బాట పట్టారు. 148 పరుగులకే చాప చుట్టేశారు.
Also Read : బ్రాండ్ వాల్యూలో కోహ్లీనే ఐకాన్