AP New Districts : ఏపీ (AP) సీఎం ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇక వెనుదిరిగి చూడటం అంటూ ఉండదు. ఇప్పటికే ఆయన కొలువు తీరిన వెంటనే మొదటగా ప్రజలకు స్పష్టం చేశారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తాను అనుకున్నది చేస్తానని, తన తండ్రి పేరు నిలబెడతానని చెప్పారు. అంతే కాదు విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పరిశ్రమల ఏర్పాటుతో పాటు పరిపాలనా పరంగా వికేంద్రీరణ కు ప్రయారిటీ ఇచ్చారు.
ఇదే విషయాన్ని ఆయన ఆచరణలో చేసి చూపించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొత్త జిల్లాలు (New districts) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు గాను కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ఏపీ సీఎం (AP CM) సందింటి జగన్ మోహన్ రెడ్డి.
ఏప్రిల్ 4న ఉదయం 9 గంటల 5 నుంచి 9. 45 గంటలకు కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయి. ఈ మేరకు ఏపీ (AP) రాష్ట్రంలో కొత్త జిల్లాలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోద ముంద్ర వేసింది. 26 జిల్లాల (AP New Districts) ఏర్పాటుకు వర్చువల్ పద్దతిన ఆమోదం తెలిపింది.
కొత్తగా కొలువు తీరనున్న జిల్లాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సారావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి.
వీటితో పాటు కొత్తగా రెవిన్యూ డివిజన్లను ఖరారు చేసింది సర్కార్. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్ గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహాస్తి లను ఏర్పాటు చేసింది సర్కార్.
Also Read : అంపశయ్యపై తెలుగుదేశం