BJP Protest : ఢిల్లీ సీఎం ఇంటి ముందు ఉద్రిక్త‌త‌ 

పండిట్ల‌ను అవ‌మానించారంటూ ఆందోళ‌న‌

BJP Protest  : భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) ఆధ్వ‌ర్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇంటి ముందు ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా కేజ్రీవాల్ (Kejriwal) వివేక్ అగ్ని హోత్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ది క‌శ్మీర్ ఫైల్స్ మూవీపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఆ చిత్రాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాల‌ని సూచించారు. ఫ‌క్తు రాజ‌కీయంగా వాడుకుంటున్నారంటూ మండిప‌డ్డారు. ప్ర‌త్యేకించి ప్ర‌ధాని త‌న భుజం మీద వేసుకుని ప్ర‌చారం చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

అంతే కాదు ఎంత మంది కాశ్మీరీ పండిట్ల‌కు కాశ్మీర్ లోయలో పునరావాసం క‌ల్పించారంటూ ప్ర‌శ్నించారు. ఎనిమిదేళ్లు కావ‌స్తోంది బీజేపీ కేంద్ర స‌ర్కార్(BJP Protest )కొలువుతీరి.

ఈ స‌మ‌స్య‌ను ఇప్పుడే ఎందుకు తీసుకు వ‌స్తున్నారంటూ నిల‌దీశారు. అసెంబ్లీలో సినిమాకు వినోద ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాలంటూ బీజేపీ (BJP) నాయ‌కులు కోర‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ .

దీంతో స‌భ‌కు ఆటంకం క‌లిగిస్తున్నారంటూ ఇద్ద‌రు బీజేపీ ఎమ్మెల్యేల‌ను ఒక రోజు స‌స్పెండ్ చేశారు. ఈ త‌రుణంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో (BJP Protest )సీఎం ఇంటి ముందు నానా హంగామా సృష్టించారు.

అద్దాలు ధ్వంసం చేశారంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష సిసోడియా ఆరోపించారు. అయితే  కావాల‌ని పండిట్ల‌ను టార్గెట్ చేస్తూ అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) త‌క్కువ చేసి మాట్లాడుతున్నారంటూ బీజేపీ (BJP) నాయ‌కులు ఆరోపించారు.

దీంతో ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్రిక‌త్త ప‌రిస్థితి నెల‌కొంది.  కేజ్రీవాల్ (Kejriwal) ఇంటి వ‌ద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాలు, భ‌ద్ర‌తా అడ్డంకుల్ని సంఘ విద్రోహ శ‌క్తులు ధ్వంసం చేశారంటూ సిసోడియా ఆరోపించారు.

Also Read : గాంధీ..పీకే మ‌ధ్య బంధం బ‌లప‌డేనా

Leave A Reply

Your Email Id will not be published!