Kumar Sangakkara : క్రికెట్ దిగ్గ‌జం ఎప్ప‌టికీ మ‌రిచిపోం

యోధుడు షేన్ వార్న్ కు క‌న్నీటి నివాళి

Kumar Sangakkara  : ఇవాల్టితో ఈ ప్ర‌పంచంతో క్రికెట్ దిగ్గ‌జం షేన్ వార్న్ బంధం తెగి పోయింది. అశేష జ‌న‌వాహిని మ‌ధ్య ..అశ్రు న‌య‌నాల మ‌ధ్య అంతిమ వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో ఎన‌లేని బంధం ఉంది షేన్ వార్న్ కు.

2008లో ఐపీఎల్ టైటిల్ ను తీసుకు వ‌చ్చాడు వార్న్. ఆ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టైటిల్ గెల‌వ‌లేదు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం ఆర్ఆర్ మెంటార్ కుమార సంగ‌క్క‌ర (Kumar Sangakkara)క‌న్నీటి నివాళి అర్పించాడు.

ఇవాళ వీడియోను పంచుకున్నాడు. మెల్ బోర్న్ లో జ‌రిగిన స్మార‌క సేవ‌లో వార్న్ ని గుర్తు చేసుకున్నారు.

సంగీత సూప‌ర్ స్టార్లు ఎల్ట‌న్ జాన్ , క్రిస్ మార్టిన్ వీడియో లింక్ ను కూడా జ‌త చేశాడు సంగ‌క్క‌ర‌.

2008 నుంచి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు సేవ‌లు అందిస్తూ వ‌చ్చాడు వార్న్. అత‌ను జీవితం కంటే పెద్ద‌వాడు. నిర్మాణాన్ని ఎన్న‌డూ ఇష్ట ప‌డ‌లేదు. ఆంక్ష‌ల‌ను ఎప్పుడూ ఇష్ట ప‌డ‌లేదు.

వార్న్ మైదానంలో , వెలుప‌ల‌, కుటుంబం , స్నేహితులు చేసే ప్ర‌తిదానిలో త‌న‌కు తాను అన్నింటినీ ఇచ్చాడ‌ని తెలిపాడు.

గ్రౌండ్ లో వార్న్ చేసిన వాటి గురించి, అత‌ని నైపుణ్య ప‌రంగా, మేధావి ప‌రంగా నేను మాట్లాడ‌గ‌ల‌ను. అత‌డి క్రికెట్ మెద‌డు ఎంతో గొప్ప‌ద‌న్నాడు.

వ్యూహాత్మ‌కంగా ఒక మేధావి. ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచి పోయాడు. ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాన్ని తాకాడు.

వార్న్ అసాధ్య‌మైన దాన‌ని సుసాధ్యం చేశాడు. యావ‌త్ ప్ర‌పంచం అత‌డిని త‌మ‌లో ఇముడ్చుకుంద‌ని పేర్కొన్నాడు సంగ‌క్క‌ర‌.

వార్న్ జీవితం కంటే పెద్ద వాడు. ప్ర‌త్యేక‌మైన ఆట‌గాడు. ప్రామాణిక‌మైన వాడు. అస‌లైన వ్య‌క్తి.

జీవితాన్ని పూర్తిగా జీవించాడు. షేన్ వార్న్ ఎలా జీవించాలి అని అనుకున్నాడో అలాగే జీవించాడు.

నాతో పాటు కోట్లాది మంది వార్న్ ను ప్రేమించామ‌ని తెలిపాడు. అత‌ని అంతిమ యాత్ర‌లో వెళుతున్న‌ప్పుడు అత‌డి కుటుంబానికి ప్రేమ‌ను పంపుతున్నాను.

అత‌డు క్రికెట్ లో ఎప్ప‌టికీ రాజే. మిత్ర‌మా దేవుడు నిన్ను ఆశీర్వ‌దిస్తాడు. నా స్నేహితుడిని దేవుడు కాపాడుతాడ‌ని సంగ‌క్క‌ర భావోద్వేగంతో నివాళులు అర్పించాడు.

Also Read : ధిక్కార స్వ‌రం ప‌ద‌వీ గండం

Leave A Reply

Your Email Id will not be published!