Will Smith : ఆస్కార్ (Oscar) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా కమెడియన్ స్టార్ క్రిస్ రాక్ (Chris Rock) పై దాడికి పాల్పడిన ప్రముఖ నటుడు విల్ స్మిత్(Will Smith) వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా రాద్దాంతం చోటు చేసుకుంది.
తీవ్ర చర్చకు దారి తీసింది. విల్ స్మిత్ (Will Smith) ఆస్మార్ (Oscar) నుండి నిష్క్రమించమని అడిగారు. దీనికి ఆయన తిరస్కరించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మెగా స్టార్ గా పేరొందిన విల్ స్మిత్ పై క్రమ శిక్షణా చర్య ప్రారంభించినట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది.
ఈ సమయంలో ఓపెన్ హ్యాండ్ స్లాప్ కోసం అకాడమీ నుంచి బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది కింగ్ రిచర్డ్ లో తన పాత్రకు ఉత్తమ నటుడి అవార్డును అందజేసేందుకు కొన్ని క్షణాల ముందు వచ్చింది.
ఈ ప్రకటన ప్రేక్షకులను, అభిమానులను తెగ సంతోషానికి గురి చేసింది. మిస్టర్ విల్ స్మిత్(Will Smith) ను వేడుక నుంచి నిష్క్రమించమని అడిగారు. నిరాకరించారని తాము స్పష్టం చేయాలని అనుకుంటున్నామని తెలిపారు.
హాలీవుడ్ (Hollywood) కు సంబంధించి అత్యంత ముఖ్యమైన సాయాంత్రాన్ని దెబ్బ తీసిన విల్ స్మిత్ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఓటింగ్ నిర్వహిస్తామని ఆస్కార్ లను అందజేసే సంస్థ అకాడమీ వెల్లడించింది.
అకాడమీ ప్రవర్తనా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు, బెదిరింపు ప్రవర్తన , అకాడమీ సమగ్రతను దెబ్బ తీసినందుకు విల్ స్మిత్ పై బోర్డ్ ఆఫ్ గవర్నర్న్ చర్యలు ప్రారంభించిందని తెలిపింది.
Also Read : పక్కాగా జూలై 1న గోపీచంద్ వచ్చేస్తాడట