CSK vs LSG IPL 2022 : ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ముందు బిగ్ టార్గెట్ ఉంచింది.
తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే కోల్ కతా నైట్ రైడర్స్(CSK vs LSG IPL 2022) తో ఓడి పోయింది. ఇక ముందుగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక బరిలోకి దిగిన సీఎస్కే 28 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ ను కోల్పోయింది.
4 రన్స్ చేసి లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ అండగా రాబిన్ ఉతప్ప చెలరేగాడు. బంతుల్ని బౌండరీలకు తరలించాడు.
25 బాల్స్ ఆడి 8 ఫోర్లు ఓ సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక మొయిన్ అలీ, ఉతప్ప కలిసి రెండో వికెట్ కు 30 బంతుల్లో 56 రన్స్ చేశారు.
మొయిన్ అలీతో పాటు శివమ్ దూబే కూడా కీలక పాత్ర పోషించారు. దీంతో సీఎస్కే భారీ స్కోర్ లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఉంచింది. ఇక శివమ్ దూబే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
49 పరుగులు చేసి మెరిపించాడు. ఇక ఆఖరులో వచ్చిన ధోనీ 6 బంతులు ఆడి 16 పరుగులు చేశాడు. 2 ఫోర్లు ఓ సిక్స్ ఉంది. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ , ఆండ్రూ టై, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read : హసరంగ రియల్ ఛాంపియన్ – చహల్