LSG vs CSK PL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా సాగింది
. చివరి దాకా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అందరినీ విస్తు పోయేలా చేసింది.
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(LSG vs CSK PL 2022) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన సీఎస్కే భారీ స్కోర్ నమోదు చేసింది.
రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే శివాలెత్తారు. వచ్చిన ప్రతి బంతిని బౌండరీ లైన్ దాటించేందుకు ఉతప్ప 50 రన్స్ చేస్తే శివమ్ 49 పరుగులు చేసి కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ 18వ ఓవర్ పూర్తయ్యే సరికి లక్నో ముందు భారీ టార్గెట్ ఉంది. కానీ క్లింటన్ డికాక్ , లూయిస్ మ్యాచ్ ను తిప్పేశారు. లక్నోకు విజయాన్ని అందించారు.
12 బంతులు 34 పరుగులు చేయాల్సి ఉండగా ఇక విక్టరీ తమదేనని సంబర పడ్డారు డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.
కానీ ఆ జట్టు ఆశలపై వీళ్లిద్దరూ నీళ్లు చల్లారు.
19వ ఓవర్ లో శివమ్ దూబేతో చేసిన ప్రయోగం ఫలించ లేదు. ఈ ఒక్క ఓవర్ లోనే లక్నో భారీగా పరుగులు రాబట్టింది. ఏకంగా 2 వైడ్లతో 25 పరుగులు వచ్చాయి.
దీంతో ఆఖరులో వచ్చి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసిన ఎవిన్ లూయిస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
మనోడు 23 బంతులు ఆడి 55 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.
ఇందులో 6 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. ఆ తర్వాత ఆయుష్ బదోని 9 బంతులు ఆడి 2 సిక్స్ లతో 19 రన్స్ చేయడంతో విజయం పూర్తయింది.
అంతకు ముందు సీఎస్కే 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
Also Read : ఫుట్ బాల్ కు ‘సలాహ్’ గుడ్ బై..?