Dwayne Bravo : ఐపీఎల్ 2022లో అరుదైన ఘనత సాధించాడు చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన డ్వేన్ బ్రావో. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో టాప్ వికెట్ టేకర్ గా ఉన్న శ్రీలంక దిగ్గజ క్రికెటర్ లసిత్ మలింగ పేరు మీద ఉన్న 170 వికెట్లను బద్దలు కొట్టాడు డ్వేన్ బ్రావో.
లీగ్ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన మ్యాచ్ లో దీపక్ హూడాను అవుట్ చేయడంతో 171 వికెట్లు తీసిన బౌలర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇప్పటి వరకు వికెట్లు తీసిన వారిలో అమిత్ మిశ్రా 166 వికెట్లతో పీయూష్ చావ్లా 157 , హర్భజన్ సింగ్ 150 వికెట్లతో తర్వాతి స్థానాలో ఉన్నారు. ఇక బ్రావో(Dwayne Bravo) సుదీర్ఘ కాలం పాటు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
బ్యాటర్ గా, ఫీల్డర్ గా అంతకు మించి బౌలర్ గా తనకు తానే సాటి. ఐపీఎల్ లో ఎన్నదగిన ప్లేయర్లలో ఒకడిగా పేరొందాడు బ్రావో(Dwayne Bravo). మొదట్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.
ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడడం మొదలు పెట్టాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు పలికే ఆటగాడిగా మారాడు బ్రావో. 2016, 2017 లో కొంత కాలం గాయాలు అతడిని బాధ పెట్టాయి.
కానీ ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాడు. తనదైన శైలిలో బౌలింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇవాళ అరుదైన ఫీట్ సాధించి ఔరా అనేలా చేశాడు డ్వేన్ బ్రావో.
Also Read : వరల్డ్ కప్ ఫైనల్ కు ఇంగ్లండ్