PAK vs AUS 2nd ODI ; పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఆ దేశ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ పరుగులు(PAK vs AUS )చేయడంలో టాప్ లో ఉన్నాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరీస్ లో ఫస్ట్ వన్డేలో ప్రత్యర్థి జట్టు గెలుపొందితే రెండో వన్డేలో పాకిస్తాన్ దుమ్ము రేపింది.
భారీ స్కోర్ ను అవలీలగా ఛేదించింది. బాబర్ ఆజమ్ తో పాటు ఇమామ్ ఉల్ హక్ సత్తా చాటారు. తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. కళ్లు చెదిరే షాట్స్ ఆడుతూ పరుగులు పెట్టించారు.
ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ అద్భుతమైన సెంచరీలు సాధించారు.
బాబర్ ఆజమ్ 83 బంతులు ఆడి 114 పరుగులు చేశాడు. ఉల్ హక్ 97 బాల్స్ ఎదుర్కొని 106 పరుగులు చేశాడు.
దీంతో ఆస్ట్రేలియా పాకిస్తాన్ ముందు ఉంచిన 349 పరుగుల స్కోర్ ను అవలీలగా ఛేదించింది.
ఇదిలా ఉండగా మూడు మ్యాచ్ ల వన్డే సీరీస్ ను 1-1తో సమం చేసింది. మూడో మ్యాచ్ నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా(PAK vs AUS) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 రన్స్ చేసింది.
కాగా 2017 లో మెల్ బోర్న్ తర్వాత ఆసిస్ పై పాకిస్తాన్ జట్టుకు ఇదే విక్టరీ కావడం విశేషం.
అంతకు ముందు జరిగిన తొలి మ్యాచ్ లో ఆసిస్ పాకిస్తాన్ పై 88 రన్స్ తేడాతో గెలుపొంది.
2014లో మీర్ పూర్ లో బంగ్లాదేశ్ పై సాధించిన 327 పరుగులే గతంలో పాకిస్తాన్ అత్యధిక చేజింగ్.
అంతకు ముందు ఆసిస్ బ్యాటర్ మెక్ డెర్మాట్ 108 బంతుల్లో 104 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ 89 చేస్తే , లాబుషేన్ 59 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక ఆల్ రౌండర్ స్టోయినిస్ ఐదు ఫోర్లు ఓ సిక్స్ తో 49 నర్స్ చేసి సత్తా చాటాడు.
Also Read : బిగ్ ఫైట్ కు పంజాబ్..కోల్ కతా రెడీ