Andre Russell : ర‌సెల్ దెబ్బ పంజాబ్ అబ్బా

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన ఆండ్రీ

Andre Russell  : ప్ర‌పంచ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్నంత క్రేజ్ ఇంకెందులోనూ ఉండ‌దు. అందుకే ఆ ఆట‌కు అంత ప్ర‌యారిటీ. ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు చుక్క‌లు చూపించాడు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆండ్రీ ర‌సెల్.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు 138 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించే క్ర‌మంలో బ‌రిలోకి దిగిన కోల్ క‌తా ఊహించ‌ని రీతిలో త‌క్కువ స్కోర్ కే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ప‌డింది.

ఆ స‌మ‌యంలో మైదానంలోకి వ‌చ్చిన ఆండ్రీ ర‌సెల్(Andre Russell )ఎక్క‌డా త‌గ్గ‌లేదు. వ‌చ్చీ రావ‌డంతోనే బాద‌డం మొద‌లు పెట్టాడు. పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

తానంటే ఏమిటో మ‌రోసారి రుచి చూపించాడు. బాల్ రావ‌డ‌మే ఆల‌స్యం బౌండ‌రీ లైన్ కు త‌ర‌లించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. క‌ళ్లు చెదిరే సిక్స‌ర్లు ఆడాడు. దీంతో ర‌సెల్(Andre Russell )సునామీ ఇన్నింగ్స్ కు కొట్టుకు పోయింది పంజాబ్.

ఐపీఎల్ టోర్నీలో అత్యుత్త‌మ ఇన్నింగ్స్ ఇదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేవ‌లం 51 బంతులు మాత్ర‌మే ఆడిన ఆండ్రీ ర‌సెల్ 70 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 8 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి.

అంటే ర‌స్సెల్ ఇన్నింగ్స్ లో ఫోర్లు, సిక్స‌ర్ల‌తోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. దీంతో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్ లు ఆడి ఒక‌టి ఓడి పోయింది.

ఇవాళ మ‌రో కీల‌క జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ముంబై ఇండియ‌న్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది.

Also Read : విజ‌యానందం ‘ల‌క్నో’ సంబురం

Leave A Reply

Your Email Id will not be published!