PAK vs AUS : పాకిస్తాన్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది పాకిస్తాన్. మూడు వన్డే సీరీస్ లో భాగంగా మూడో వన్డే మ్యాచ్ కీలకంగా మారింది. ఎవరు గెలిస్తే వారికి సీరీస్ దక్కుతుంది.
ఫస్ట్ వన్డే లో ఆస్ట్రేలియా విజయం సాధించగా రెండో వన్డే మ్యాచ్ లో భారీ టార్గెట్ ను ఛేజ్ చేసింది పాకిస్తాన్(PAK vs AUS ). చరిత్ర సృష్టించింది. ఈ తరుణంలో నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో మరోసారి సత్తా చాటాడు వరల్డ్ స్టార్ ప్లేయర్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.
ఈ కీలక మ్యాచ్ లో బాబర్ ఆజమ్ 12 ఫోర్లతో 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అజేయ సెంచరీతో సత్తా చాటడంతో ఆసిస్ పై గెలుపొంది వన్డే సీరీస్ చేజిక్కించుకుంది.
ఆఖరి వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో ఆసిస్ ను చిత్తు చేసింది సత్తా చాటింది. దీంతో 2-1తో సీరీస్ కైవసం చేసుకుంది పాకిస్తాన్ టీం. ముందు నుంచి బాబర్ ఆజమ్ గోడలా పాకిస్తాన్ జట్టుకు (PAK vs AUS )నిలబడుతూ వస్తున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ టీమ్ లో అలెక్స్ కారీ 56 పరుగులు చేస్తే సీన్ అబౌట్ 49 చేసి సత్తా చాటారు.
ఇక పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ , వసీమ్ చెరో మూడు వికెట్లు తీసి ఆసిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ టీం బాబర్ ఆజమ్ తో పాటు ఇమాముల్ హక్ దుమ్ము రేపారు.
ఆజమ్ సెంచరీతో సత్తా చాటితే హక్ 89 రన్స్ చేశాడు. ఇక మూడు మ్యాచ్ ల్లో 276 పరుగులు చేసిన కెప్టెన్ బాబర్ ఆజమ్ కు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ దక్కింది.
Also Read : రెచ్చి పోయిన బట్లర్..హెట్మెయిర్