AUSW vs ENGW WC 2022 : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ 2022 మహిళా వన్డే వరల్డ్ కప్(AUSW vs ENGW WC 2022) లో చివరి అంకం చేరుకుంది. కీలకమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో ఆసిస్ స్టార్ బ్యాటర్ హేలీ దుమ్ము రేపింది.
టోర్నీలోనే అత్యంత బిగ్ స్కోర్ సాధించింది. ఓపెనర్ గా వచ్చిన అలిస్సా హేలి సత్తా చాటింది. మెరుపు ఇన్నింగ్స్ తో చుక్కలు చూపించింది. ఏకంగా ప్రత్యర్థి ఇంగ్లండ్ ముందు 357 పరుగుల టార్గెట్ విధించింది.
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో ఆస్ట్రేలియా తన విజయ పరంపరను కొనసాగించింది. వరల్డ్ కప్ ఫైనల్ కు సంబంధించిన మ్యాచ్ లో ఇంగ్లండ్ మహిళా జట్టు(AUSW vs ENGW WC 2022) మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
మైదానంలోకి వచ్చిన ఓపెనర్లు రాచెల్ హేన్స్ 7 ఫోర్లతో 93 బంతులు ఆడి 68 రన్స్ చేసింది. ఇక హేలీ 138 బంతులు ఆడి 26 ఫోర్లతో ఏకంగా 170 పరుగులు చేసింది.
ఇక వన్ డౌన్ లో వచ్చిన బెత్ మూనీ సైతం కేవలం 47 బంతులే ఆడి 62 రన్స్ చేసి సత్తా చాటింది. హేలీ అవుటైనా ఇంగ్లండ్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు ముందు బిగ్ టార్గెట్ ముందుంచింది. ఇక మ్యాచ్ పరంగా చూస్తే ఇంగ్లండ్ బౌలర్లలో అన్య శ్రుబ్బోలేకు మూడు వికెట్లు దక్కగా సోఫీ ఎక్లిస్టోన్ కు ఒక వికెట్ దక్కాయి.
Also Read : బట్లర్ స్టన్నింగ్ క్యాచ్ సెన్సేషన్