Sourav Ganguly : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టుకు అన్ని ఫార్మాట్ లలో హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు.
అన్ని ఫార్మాట్ లలో టీమిండియా సూపర్ గా రాణిస్తోందంటూ పేర్కొన్నాడు. భవిష్యత్తులో భారత జట్టు మరిన్ని అద్బుతాలు చేస్తుందనడంలో సందేహం లేదన్నారు.
మొదట్లో కొంత ఇబ్బంది ఏర్పడినా తర్వాత జట్టు పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు జూనియర్స్ ను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాడని ద్రవిడ్ కు కితాబు ఇచ్చాడు గంగూలీ(Sourav Ganguly). కోచ్ గా ఇప్పటికే అపారమన అనుభవం ఉందన్నాడు.
ద్రవిడ్ ను ఏరికోరి కోచ్ గా నియమించడంలో కీలక పాత్ర పోషించాడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). రాహుల్ గత ఏడాది టీం ఇండియాకు కోచ్ గా నియమితుడయ్యాడు. ఇటీవలే భారత్ 2 మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ లంకను ఓడించింది.
బీసీసీఐ చీఫ్ గంగూలీ తన మాజీ సహచరుడు రాహుల్ ద్రవిడ్ పనితీరు అద్భుతంగా ఉందన్నాడు. తీవ్రమైన , ఖచ్చితమైన , వృత్తి పరమైన నిబద్దత కలిగి ఉన్నాడని ప్రశంసించాడు సౌరవ్ గంగూలీ.
రాఓయే రోజుల్లో ఇంకా అద్భుత ఫలితాలు రావడం ఖాయమన్నారు. తాము ఆడే రోజుల నుంచి నేటి దాకా రాహుల్ ద్రవిడ్ కీలకంగానే ఉన్నాడని పేర్కొన్నాడు గంగూలీ. ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న బీసీసీఐ చీఫ్ పాల్గొని ప్రసంగించారు.
Also Read : బట్లర్ స్టన్నింగ్ క్యాచ్ సెన్సేషన్