AUSW vs ENG WC 2022 : మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత ఆసిస్

చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా

AUSW vs ENG WC 2022  : ఐసీసీ మహిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస్ట్రేలియా వశ‌మైంది. ఇంగ్లండ్ పై ఫైన‌ల్ మ్యాచ్ లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుంగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ దుమ్ము రేపింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించింది.

ఏకంగా ఇంగ్లండ్ పై 71 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచు కోవ‌డం త‌ప్ప‌ని తేలి పోయింది.

ఇక ఆసిస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 356 ప‌రుగులు చేసింది.

ఓపెన‌ర్లు హేలీ 138 బంతులు ఆడి 170 ప‌రుగులు చేసి స‌త్తా చాటింది. మ‌రో ప్లేయ‌ర్ రాచెల్ హేన్స్ 68 ప‌రుగులు చేసింది

. వీరిద్ద‌రూ క‌లిసి భారీ పార్ట్ న‌ర్ షిప్ ను న‌మోదు చేశారు.

ఇంకో ప్లేయ‌ర్ మూనీ 62 ర‌న్స్ చేసి స‌త్తా చాటింది. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సోల్ 3 వికెట్లు తీసింది. అనంత‌రం భారీ టార్గెట్ ను ఛేదించే క్ర‌మంలో మైదానంలోకి దిగిన ఇంగ్లండ్ 43. 4 ఓవ‌ర్ల‌లో 285 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది.

చివ‌రి దాకా పోరాడేందుకు ప్ర‌య్నం చేసింది ఆ జ‌ట్టు. ఇంగ్లండ్ టీం( AUSW vs ENG WC 2022 )నుంచి న‌టాలీ స్కైవ్ 121 బంతులు ఆడి 148 ప‌రుగులు చేసింది. నాటౌట్ గా నిలిచి స‌త్తా చాటింది.

ఆమె ఓవైపు ఆడుతున్నా ఇంకో వైపు జ‌ట్టు ఆట‌గాళ్ల నుంచి స‌రైన మ‌ద్ద‌తు ఇవ్వ‌క పోవ‌డంతో ఇంగ్లండ్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

ఈసారైనా ఎలాగైనా వ‌ర‌ల్డ్ క‌ప్ ఎగ‌రేసుకు పోవాల‌ని క‌ల‌లు క‌న్న ఇంగ్లండ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది ఆసిస్.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఆరు సార్లు గెలిచిన ఆసిస్ మ‌రోసారి గెలిచి త‌న‌కు ఎదురే లేద‌ని చాటి చెప్పింది. విశ్వ విజేత‌గా నిలిచింది ఆసిస్ టీం.

Also Read : హీలీ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్

Leave A Reply

Your Email Id will not be published!