Alyssa Healy : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆ జట్టు ఈ టైటిల్ ను గెలవడం వరుసగా ఇది ఏడోసారి. ఫైనల్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఆసిస్ ప్లేయర్ అలిస్సా హీలీ(Alyssa Healy )దుమ్ము రేపింది.
తన ఆట తీరుతో సత్తా చాటింది. జట్టు భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించింది. అంతే కాదు వరల్డ్ టోర్నీమెంట్ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచింది. దీంతో 509 పరుగులు చేసిన అలెస్సా హీలీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికైంది.
ఈ టోర్నీలో ఓటమి అన్నది ఎరుగకుండా కంటిన్యూగా గెలుస్తూ ఫైనల్ కు చేరింది ఆసిస్. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కరెన్ రోల్టన్ 2005లో , అంతర్జాతీయ స్టార్ లు ఇంగ్లండ్ కు చెందిన క్లైర్ టేలర్, 2013లో న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్ , ఇంగ్లండ్ కు చెందిన టామీ బ్యూమాంట్ లు సమకాలీన ఆటగాళ్లుగా ఉన్నారు అలెస్సా హీలీకి.
తన పేరును మునుపటి విజేతల ప్రతిష్టాత్మక రోల్ కాల్ లో చేర్చారు. అత్యంత గౌరవ ప్రదమైన అవార్డును గెలుచుకుంది హీలీ(Alyssa Healy ). ఇక ఆమె బ్యాటర్ గానే కాదు మంచి వికెట్ కీపర్ కూడా. న్యూజిలాండ్ లోని ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ రన్స్ చేసింది.
టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ , ఫైనల్ లో అలెక్సా హీలీ చేసిన సెంచరీలతో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఏడో ప్రపంచ కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
32 ఏళ్ల ఈ బ్యాటర్ సగటు 56. 55 తో నిలిచింది. వికెట్ కీపర్ గా నాలుగు క్యాచ్ లు పట్టింది. నలుగురిని స్టంప్స్ చేసింది.
Also Read : పోరుకు చెన్నై సై పంజాబ్ రెడీ