Ravichandran Ashwin : భారత క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్ ది వెరీ స్పెషల్. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టాప్ స్పిన్నర్లలో మనోడు కూడా ఒకడు. కళ్లు చెదిరేలా బంతుల్ని గిర గిరా తిప్పడంలో అందె వేసిన చేయి.
ఒక్కసారి ఏమరుపాటుగా ఉంటే ఇక వికెట్లు సమర్పించు కోవాల్సిందే. అందుకే అశ్విన్ (Ravichandran Ashwin)మైదానంలో బౌలింగ్ చేస్తున్నాడంటే ఎంతటి విధ్వంసకరమైన బ్యాటర్లైనా జాగ్రత్తగా ఉంటారు.
తమ బ్యాట్ లకు పదును పెడతారు. ఒక్కసారి షాట్లు ఆడడం కంటే డిఫెన్స్ ఆడడమే బెటర్ అని భావిస్తారు. దీన్ని బట్టి చూస్తే రవిచంద్రన్ అశ్విన్ ఎంతటి ప్రమాదకరమైన స్పిన్నరో..బౌలరో ఈ పాటికే అర్థమై పోయి ఉంటుంది.
ఒక్కోసారి డిఫెన్స్ ( రక్షణాత్మకంగా ) ఆడేందుకు ప్రయత్నం చేసినా బ్యాటర్ కు తెలియ కుండానే బంతి వికెట్లను తాకుతుంది. పోనీ వికెట్లను కాపాడుకుందామని ట్రై చేస్తే బంతి కాళ్లను తాకుతుంది.
అయితే వికెట్ ను సమర్పించు కోవాలి. లేదంటే ఎల్బీడబ్ల్యూగా నైనా పెవిలియన్ దారి పట్టాలి. ఇది రవిచంద్రన్ కు ఉన్న ప్రతిభా నైపుణ్యం.
అందుకే రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధరకు తీసుకుంది. మన్కడింగ్ లో మనోడే చరిత్ర సృష్టించాడు.
తాజాగా ముంబై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రిటైర్డ్ ఔట్ గా వెను దిరిగాడు. ఇప్పుడు ఇది క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
అసలు రిటైర్డ్ ఔట్ అంటే అర్థం ఏమిటని. ఏమీ లేదు. తనంతకు తాను ఇంకో ఆటగాడికి ఛాన్స్ ఇచ్చేందుకు పెవిలియన్ కు వెళ్లి పోవడం. అలానే చేశాడు అశ్విన్(Ravichandran Ashwin) సంచలనం సృష్టించాడు.
Also Read : వారెవ్వా వార్నర్ షాన్ దార్ షా