Ravi Shastri : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న భారత జట్టు స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా(Ravi Shastri )పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జడేజా పూర్తిగా ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఊహించని రీతిలో మహేంద్ర సింగ్ ధోనీ కి బదులు రవీంద్ర జడేజా కు సారథ్య బాధ్యతలు అప్పగించింది సీఎస్కే మేనేజ్ మెంట్.
కెప్టెన్ గా ఉండడం వల్ల ఫోకస్ పెట్టాల్సి వచ్చిందని , ప్రత్యేకించి ఆటపైనే దృష్టి సారించాలని పేర్కొన్నారు రవిశాస్త్రి. ధోనీ కొన్నేళ్ల పాటు సీఎస్కేను విజయ పథంలో నడిపించాడని తెలిపాడు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ రిచ్ లీగ్ కంటే ముందు ధోనీ అనూహ్యంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో యాజమాన్యం అనూహ్యమైన రీతిలో రవీంద్ర జడేజా(Ravi Shastri )అలియాస్ జడ్డూకు చాన్స్ ఇచ్చింది.
తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు జడ్డూ. గత ఏడాది 2021లో దుబాయిలో జరిగిన ఐపీఎల్ టైటిల్ ను ఎగరేసుకు పోయింది సీఎస్కే. కానీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లు గా ఉన్న ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలు కావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇదే సమయంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఐపీఎల్ వేలం పాటలో డుప్లెసిస్ ను సీఎస్కే తీసుకోకుండా తప్పు చేసిందని పేర్కొన్నాడు రవిశాస్త్రి.
Also Read : ‘రిటైర్డ్ ఔట్’ తో అశ్విన్ సంచలనం