Sanju Samson : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది రాజస్థాన్ రాయల్స్ . నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఇరు జట్లు పోటా పోటీగా తలపడ్డాయి.
చివరి బంతి దాకా ఉత్కంఠకు తెర తీసింది ఈ మ్యాచ్. ఐపీఎల్ 15వ సీజన్ లో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కేవలం 3 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఇది ఊహించని గెలుపు. ఇక ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.
సంజూ(Sanju Samson) సేన అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది.
మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ పై అద్భుత విజయాలు నమోదు చేసింది.
ఆర్సీబీతో చివరి దాకా వచ్చి ఓటమి పాలైంది. దినేశ్ కార్తీక్ వచ్చి గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లుకోల్పోయి 165 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ చివరి దాకా పోరాడింది. కేవలం 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు సిమ్రాన్ హిట్ మైర్ తో పాటు బౌలింగ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన యజువేంద్ర చహల్ ,
ఆఖరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు కుల్దీప్ సేన్.
ఈ సందర్భంగా సంజూ శాంసన్ (Sanju Samson)మాట్లాడాడు. టేబుల్ టాపర్ గా నిలవడం ఆనందంగా ఉందన్నాడు.
తమ జట్టు లో హెట్ మైర్ , కుల్దీప్ సేన్ , చహల్ అద్భుతంగా ఆడారంటూ కితాబు ఇచ్చారు.
ఇక ఎలా వేస్తున్నానని అంటూ నా వద్దకు వచ్చి అడిగాడని కుల్దీప్ సేన్ గురించి చెప్పాడు.
ఇక హెట్ మైర్ తో సరదాగా ఉంటుందన్నాడు. ఇక చహల్ ను ఎందుకు వదులుకుంటానని పేర్కొన్నారు శాంసన్.
Also Read : చరిత్ర సృష్టించిన చహల్