AP Cabinet Ministers : కొత్తగా కొలువు తీరిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే సీఎం వారికి శాఖలు కూడా కేటాయింపులు జరిపారు. 25 మందిలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా చాన్స్ ఇచ్చారు.
రాజన్న దొర, సత్యనారాయణ, ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ స్వామిలకు అవకాశం ఇవ్వడం విశేషం.
ఇక శాఖల వారీగా చూస్తే అంబటి రాంబాబుకు జల వనరుల శాఖ కేటాయించారు.
ఆంజాద్ భాషా మైనార్టీ సంక్షేమ శాఖ , సురేష్ కు మున్సిపల్ , అర్బన్ డెవలప్ మెంట్ , బొత్స సత్యనారాయణకు విద్యా శాఖ కేటాయించారు.
ముత్యాల నాయుడుకు పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ కేటాయించారు.
వేణు గోపాల కృష్ణ కు బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ , దాడి శెట్టి రాజాకు రోడ్లు, భవనాల శాఖ, ధర్మాన ప్రసాదరావుకు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు (AP Cabinet Ministers)కేటాయించారు.
గుడివాడ అమర్ నాథ్ కు పరిశ్రమల శాఖ, గుమ్మనూరు జయరాంకు కార్మిక శాఖ, జోగి రమేష్ కు గృహ నిర్మాణ శాఖ అప్పగించారు సీఎం.
కాకాణి గోవర్దన్ రెడ్డి కి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ , కారుమూరి నాగేశ్వర రావుకు పౌర సరఫరాలు, వినియగదారుల శాఖ, కొట్టు సత్యానారాయణకు దేవాదాయ శాఖ కేటాయించారు సీఎం.
నారాయణ స్వామికి ఎక్సైజ్ శాఖ, ఉషాశ్రీ చరణ్ కు స్త్రీ , శిశు సంక్షేమ శాఖ, మేరుగ నాగార్జున కు సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి విద్యుత్ , సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ పర్యావరణ శాఖ, విశ్వరూప్ కు రవాణా శాఖ, రాజన్న దోరకు గిరిజన సంక్షేమ శాఖను అప్పగించారు.
ఆర్కే రోజాకు(AP Cabinet Ministers) టూరిజం, సాంస్కృతిక , యువజన శాఖ, సీదిరి అప్పలరాజుకు పశు సంవర్దక , మత్స్య శాఖ, తానేటి వనిత కు హోం శాఖ, ప్రకృతి విపత్తుల నివారణ, విడదల రజనికి వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ను అప్పగించారు ఏపీ సీఎం.
Also Read : ఉచితాలు…భవిష్యత్తులో సుడిగుండాలు