Eoin Morgan : ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ , వరల్డ్ కప్ విజేత కెప్టెన్ గా పేరొందిన ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan)సంచలన కామెంట్స్ చేశాడు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఆడిన అనుభవం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నాడు.
ఇవాళ ఐపీఎల్ పై స్పందించాడు ఈ స్టార్ క్రికెటర్. విచిత్రం ఏమిటంటే కోల్ కతా నైట్ రైడర్స్ కు ఇయాన్ మోర్గాన్ స్కిప్పర్ గా ఉన్నాడు. కానీ ఆ జట్టు దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్ కు వచ్చినా కప్ గెలవలేక పోయింది.
సీఎస్కే టైటిల్ ఎగరేసుకు పోయింది. ఈ తరుణంలో ఈ ఏడాది ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఇయాన్ మోర్గాన్ కూడా వచ్చాడు.
కానీ ఏ ఒక్క ఫ్రాంచైజీ ఇయాన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం కూడా రిటైన్ చేసుకోలేదు మోర్గాన్(Eoin Morgan) ను. విచిత్రం ఏమిటంటే వైట్ బాల్ క్రికెట్ లో అత్యంత తెలివైన ఆలోచనా పరులలో ఒకడిగా పరిగణించబడ్డాడు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అత్యుత్తమ కెప్టెన్ గా పేరొందాడు. ఇంగ్లండ్ తన వైట్ బాల్ క్రికెట్ ను ఆడే విధానాన్ని మార్చినందుకు ఆయన ఘనత వహించాడు.
2019లో టోర్నమెంట్ లో ఇంగ్లండ్ కు ప్రాతినిధ్యం వహిస్తూ రాణించేలా చేశాడు. కేకేఆర్ కు నాయకుడిగా ఉంటూ ఫైనల్ వరకు తీసుకు వచ్చేలా చేశాడు. కానీ ఎందుకనో ఐపీఎల్ వేలంలో తీసుకోక పోవడం విస్తు పోయేలా చేసింది.
Also Read : సాహా ఆరోపణలపై బీసీసీఐ విచారణ