Robin Uthappa : ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాబిన్ ఉతప్ప(Robin Uthappa) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్ లో శివమ్ దూబేతో కలిసి దుమ్ము రేపాడు.
పూనకం వచ్చినట్లుగా ఆడాడు. ఏకంగా ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 165 పరుగులు చేశారు. దీంతో సీఎస్కే 23 పరుగల తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ లలో ఈ మ్యాచ్ ఒక్కటే గెలవడం.
ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే తరపున బరిలోకి దిగిన రాబిన్ ఉతప్ప(Robin Uthappa) వచ్చీరావడంతోనే దాడి చేయడం మొదలు పెట్టాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
బంతులు ఎలా వేసినా కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. రాబిన్ ఉతప్ప 50 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 9 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 88 పరుగులు చేశాడు. రాబిన్ ఉతప్ప అసలు పేరు రాబిన్ వేణు ఉతప్ప.
దేశీయ క్రికెట్ లో కేరళ తరపున ఆడుతున్నాడు. వన్డే, టీ20 ల్లో ఇండియా తరపున ఆడాడు. 2006లో వన్డే లో ఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్ గా 86 రన్స్ చేశాడు. ది వాకింగ్ అస్సాస్సిన్ అని పేరుంది.
2007 ఐసీసీ వరల్డ్ కప్ టీ20లో భారత్ సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఉతప్ప స్వస్థలం కర్ణాటకలోని కొడగు. జైన్ యూనివర్శిటీలో చదివాడు. అండర్ -19 జట్టులో ఆడాడు.
ఒకప్పుడు వికెట్ కీపర్ గా రాణించాడు. 2008 ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం చెన్నై తరపున ఆడుతున్నాడు రాబిన్ వేణు ఉతప్ప.
Also Read : గుజరాత్ కు షాక్ హైదరాబాద్ విక్టరీ